అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Daggubati Purandeswari: ప్రతిపక్ష నేత హోదాలోనే కేంద్రమంత్రులను కలిశారు - చంద్రబాబు డిల్లీ టూర్ పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

AP News : చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలోనే కేంద్ర మంత్రులను కలిశారని పురందేశ్వరి అన్నారు. పొత్తుల విషయంలో కేంద్ర పార్టీ ప్రకటిస్తుందన్నారు.

Daggubati Purandeswari: ఏపీలో ఎన్నికల పొత్తులపై వాడివేడీగా చర్చలు సాగుతోన్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన సాగడం ఆసక్తికరంగా మారింది.. ఈ పర్యటనలో ఏం చర్చలు జరిగాయి అనేది పక్కన పెడ్డితే.. ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ కలిశారని.. అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారని తెలిపారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.  ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తాము ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నామన్నారు. 

22న తేదీన నెల్లూరుకు శివరాజ్ సింగ్ చౌహాన్ రాక                                     

నెల్లూరులో మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి ఈ నెల 22న మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నెల్లూరుకు వస్తున్నారని తెలిపారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది.. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది.. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది.. ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. ప్రభుత్వంపై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారని తెలిపారు.. కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించింది అని ఆరోపించారు పురంధేశ్వరి.. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది.. నిధుల వినియోగంపై యూటిలిజెషన్ సర్టిఫికెట్ అడిగారని తెలిపారు.  

లిక్కర్ మాఫియాపైనా  విచారణకు ప్రయత్నం                              

తిరుపతి ఉప ఎన్నికల్లో వై.సి.పి. నేతలు 35 వేల దొంగ ఓట్లను చేర్చించారని.. దీనిపై విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఎలాంటి అవకతవకలు జరగలేదని రెవెన్యూ.. పోలీస్ అధికారులు నివేదిక ఇచ్చారు.. దీనిపై కూడా విచారణ జరుగుతోందన్నారు.   రాష్ట్రంలో లిక్కర్ మాఫియా పేట్రేగిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వేసిన రహదారులు బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రహదారులను పట్టించుకోవడం లేదన్నారు. సొంత ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోంది.. అందుకే పట్టాను కూడా లబ్ధిదారులు చించేస్తున్నారన్నారు. 

రైతుల్ని ప్రభుత్వం ఆదుకోలేదు           

ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతుల బీమా ని ప్రభుత్వం చెల్లించలేదు.. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోయారు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. ఎన్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగాయి. డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును ముఖ్యమంత్రి పక్కన పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో గట్టి నిర్ణయాలు తీసుకుంటోంది.. అందుకే 370 ఆర్టికల్ రద్దు.. రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేసిందని గుర్తు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget