Breaking News Telugu Live Updates: మునుగోడు ఎన్నికల్లో ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు: రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
మునుగోడు ఎన్నికల్లో ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు: రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేశారు. మునుగోడు ఎన్నికల్లో భాగంగా తాను ఎవరితోనూ డబ్బులు తీసుకోలేదన్నారు. డబ్బులు పంచం, చుక్క మందు కూడా పోయం అని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చెప్పారు. అదే విధంగా ఎన్నికల్లో పోరాడామన్నారు. కానీ బీజేపీ నేతలు ఈడీ, సీబీఐలు తమ వద్దే ఉన్నా, ఈటల రాజేందర్ ఇష్టరీతిన మునుగోడు ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, పాల్వాయి స్రవంతికి బీఆర్ఎస్ నుంచి నగదు సహాయం లభించిందని ఈటల చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆధారాలు లేవు కనుక ఈటల అమ్మవారి ఆలయానికి రాలేదని, ప్రమాణం చేయలేదన్నారు.
తాను ఎవరినీ కించపరచలేదన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల
తాను ఎవరినీ కించపరచలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వ్యక్తిగతంగా ఎవర్నీ టార్గెట్ చేయలేదని, ఆత్మసాక్షిగానే ప్రమాణం చేశానన్నారు ఈటల. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేశారు.
భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. మునుగోడు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రూ.25 కోట్లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఆరోపణలు చేశారు. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా వచ్చి ప్రమాణం చేయాలని ఈటలకు సవాల్ విసిరారు రేవంత్. చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. కానీ ఈటల అమ్మవారి ఆలయానికి రాలేదు.
భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. చెప్పినట్లుగానే ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నుంచి రూ.25 కోట్లు తీసుకోలేదని తాను ప్రమాణం చేసి, ఈటల ఆరోపణలపై మాట్లాడతానన్నారు. అయితే రేవంత్ విసిరిన సవాల్ కు ఈటల స్పందించలేదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎమ్మెల్యే ఈటల రాలేదు. ప్రమాణాల సవాల్ నేపథ్యంలో చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రమాణానికి సై - భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్ రెడ్డి
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరారు. సీఎం కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. తాను భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి తడి బట్టలతో ప్రమాణం చేస్తానని, బీజేపీ ఎమ్మెల్యే ఈటల కూడా ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను చేసిన సవాల్ లో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్ రెడ్డి బయలుదేరారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకుని ప్రమాణం చేయనున్నారు రేవంత్ రెడ్డి. అయితే బీజేపీ నేత ఈటల ఎక్కడున్నారు, ఆయన కూడా ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

