అన్వేషించండి

Praveen Prakash: ఆవేశంలో వీఆర్ఎస్ - ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు - ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్‌కు మళ్లీ చాన్స్ ఇస్తారా?

VRS:వీఆర్ఎస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ విధుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అది ఎంత వరకూ సాధ్యమన్నది అధికారవర్గాల్లోనే కాదు రాజకీయవర్గాలలోనూ స్పష్టత లేదు.

Praveen Prakash trying to rejoin:  ఏపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత, తిరిగి సర్వీసులోకి రావాలని కోరుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఒకప్పుడు చక్రం తిప్పిన ఈ అధికారి, ఇప్పుడు తన నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మీడియా ముందు వాపోవడానికి కారణం పోస్టింగ్ కోసమేనని అంటున్నారు. 

విఆర్ఎస్ నుంచి  పశ్చాత్తాపం వరకు!

వైసీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత శక్తివంతమైన అధికారిగా వెలుగొందిన ప్రవీణ్ ప్రకాష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే  విఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నారు. తన లేఖను సచివాలయం పోస్ట్ బాక్స్‌లో వేసి వెళ్ళిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  ఆరేళ్ల సర్వీసు ఉండగానే తీసుకున్న ఈ నిర్ణయం తప్పని ఆయనకు ఏడాదిన్నర తిరగకముందే అర్థమైనట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆయన వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, తాను చేసిన తప్పులను ఒప్పుకోవడం, క్షమాపణలు కోరడం చూస్తుంటే.. ఆయనకు మళ్లీ ఐఏఎస్ హోదా కావాలనే ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

నిబంధనల ప్రకారం, ఒక ఐఏఎస్ అధికారి సమర్పించిన విఆర్ఎస్ దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించి, సదరు అధికారి రిలీవ్ అయిన తర్వాత దానిని వెనక్కి తీసుకోవడం  అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.  సాధారణంగా విఆర్ఎస్ అమల్లోకి రాకముందే దానిని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం రాజీనామాను లేదా విఆర్ఎస్‌ను ఆమోదించిన తర్వాత, దానిని రద్దు చేసి తిరిగి సర్వీసులోకి తీసుకోవడం అనేది అరుదుగా, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. దీనికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ  అనుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వ బలమైన సిఫార్సు అవసరం.

అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్‌కు లేని మద్దతు

ప్రవీణ్ ప్రకాష్ సర్వీసులో ఉన్నప్పుడు తన తోటి ఐఏఎస్ అధికారులతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఆయనకు పెద్ద శాపంగా మారింది. గత ప్రభుత్వంలో ఆయన  అతి  వల్ల ఇబ్బందులు పడ్డ అధికారులు, అవమానాలకు గురైన వారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్నారు. ప్రవీణ్ ప్రకాష్ వల్ల ఇబ్బందులకు గురైన సహచర అధికారులు, ఆయనను మళ్లీ వ్యవస్థలోకి రానివ్వడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఒక అధికారిపై ఇతర అధికారులందరిలోనూ ఇంత వ్యతిరేకత ఉండటం ఆయన పునరాగమనానికి ప్రధాన అడ్డంకి.
  
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణంగా అధికారుల పట్ల కక్షసాధింపు ధోరణితో ఉండరు. గతంలో చంద్రబాబుకు ప్రవీణ్ ప్రకాష్ సన్నిహితంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, గత ఐదేళ్లలో ఆయన వ్యవహరించిన తీరు, వ్యవస్థలను ప్రభావితం చేసిన విధానం చంద్రబాబుకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఆయనను మళ్లీ చేరదీస్తే అది ఇతర అధికారులకు తప్పుడు సంకేతాలు పంపుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు! 

ప్రస్తుతానికి ప్రవీణ్ ప్రకాష్ చేస్తున్న ప్రయత్నాలు అరణ్య రోదనగానే కనిపిస్తున్నాయి. ఒక అధికారిగా ఆరేళ్ల సర్వీసును వదులుకుని బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు మీడియా వేదికగా తన బాధను చెప్పుకోవడం వల్ల సానుభూతి కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు దాదాపు శూన్యమని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. అటు నిబంధనలు సహకరించకపోవడం, ఇటు రాజకీయంగానూ, అధికారికంగానూ మద్దతు లేకపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ అధికారి  హోదాలోనే మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget