TDP strategist PK : టీడీపీ స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్! ఫుల్ టైమా ? పార్ట్ టైమా ?
TDP strategist PK : స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పని చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఫుల్ టైమ్ పని చేస్తారా.. పార్ట్ టైమా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
TDP strategist PK : దేశంలోనే అత్యంత విజయవంతమైన పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ( Prashanth Kishore ) ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆయన వైఎస్ఆర్‌సీపీకి పని చేస్తున్నారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ప్రత్యేక విమానంలో నారా లోకేష్‌తో కలిసి విజయవాడ వచ్చి .. నేరుగా వెళ్లి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ అంశం తెలుగు రాజకీయాల్లో బ్లాస్టింగ్ న్యూస్ లాంటిదే. ఇక నుంచి పీకే టీడీపీకి పని చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
టీడీపీకి పని చేస్తున్న షో టైమ్ కన్సల్టెన్సీ రాబిన్ శర్మ టీం
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి షో టైమ్ కన్సల్టింగ్ అనే సంస్థ పని చేస్తోంది. ఈ సంస్థకు రాబిన్ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల వీరి టీంలో శాంతను సింగ్ అనే మరో వ్యక్తి చేరాడు. నిజానికి రాబిన్ శర్మ, శాంతను సింగ్ గతంలో ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఐ ప్యాక్ ను ప్రారంచిన టీమ్‌లో సభ్యులు. వీరందరూ కలిసి ఐ ప్యాక్ ను ప్రారంభించి తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. దేశంలో మరో కీలక స్ట్రాటజిస్టుగా ఉన్న సునీల్ కనుగోలు కూడా మాజీ ఐప్యాక్ వ్యూహకర్తే. అయితే ప్రశాంత్ కిషోర్ కొంత కాలంగా స్ట్రాటజిస్ట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. బీహార్ లో సొంత రాజకీయాలు చేస్తున్నారు. పాదయాత్ర కూడా చేశారు.
చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ - షాక్‌లో వైసీపీ!
ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పని చేసేందుకు సిద్ధమయ్యారా ?
తెలంగాణ ఎన్నికలకు ఏడాది ముందు సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ఐ ప్యాక్ తో కలిసి పని చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ బంధం ముగిసిపోయింది. కేసీఆర్ వద్దనుకున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ బీహార్ లో పాదయాత్ర చేశారు. మధ్యలో నిలిపివేశారు. ఇటీవల పలు టీవీ చానల్స్ డిబేట్స్ లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. దేశంలో మరే ప్రభుత్వం చేయని విధంగా అప్పులు చేసి డబ్బులు పంచుతున్నారని ఇలా చేయడం వల్ల దివాలా స్థితికి చేరుతుందని ఓ సారి వ్యాఖ్యానించారు. వైసీపీ కోసం పని చేసినందున ఇప్పుడు చాలా మంది తనను విమర్శిస్తున్నారని మరోసారి కామెంట్ చేశారు. ఇలా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో జాతీయ మీడియాలో టీడీపీకి స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ రాబోతున్నారన్న ప్రచారం జరిగింది. అది ఇప్పుడు నిజయమయింది.
ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లకే ఎక్కువ అధికారం - జగన్ తీరుపై ఉండవల్లి హాట్ కామెంట్స్
పూర్తి స్థాయి స్ట్రాటజిస్టుగా పని చేస్తారా ? రాబిన్ శర్మ టీంకు సలహాలిస్తారా ?
నేరుగా చంద్రబాబుతో సమావేశం కావడంతో.. . ప్రశాంత్ కిషోర్ ఇక టీడీపీతో కలిసి పని చేస్తారని అనుకోవచ్చు. అయితే నేరుగా పని చేస్తారా లేకపోతే.. సలహాదారుగా ఉంటారా అన్నది మాత్రం స్పష్టత లే్దు. ప్రశాంత్ కిషోర్ గతంలో తాను స్ట్రాటజిస్టుగా పని చేయడం మానేశానని ప్రకటించారు. అందుకే ఇప్పుడు ఫుల్ టైం స్ట్రాటజిస్టుగా టీడీపీకి పని చేస్తారా లేకపోతే.. రాబిన్ శర్మ టీంకు సలహాదారుగా ఉంటారా అన్నది స్పష్టత రాాల్సి ఉంది. ఈ బృందం చర్చల తర్వాత టీడీపీ నుంచి సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి అధికారిక ప్రకటన చేసే చాన్స్ ఉండదని భావిస్తున్నారు.