Andhra Power Minister : జగన్ ప్రజల రక్తం పీల్చారు - టీడీపీ హయాంలో కరెంట్ చార్జీలు పెరగవు - విద్యుత్ మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన
Gottipati : ఏపీలో విద్యుత్ చార్జీలు పెరగబోవని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. జగన్ హయాంలో డిస్కంల అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేశారని మండిపడ్డారు.
Andhra Pradesh : జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని ... వాటి రేటింగ్ దిగజారిపోయిందన్నారు. గడిచిన ఐదేళ్లలో కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని.. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు తెచ్చారని గుర్తు చేశారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి ప్రజల రక్తం తాగారని విమర్శించారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంట్ బిల్లులను పెంచలేదని కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఐదేళ్ల కాలంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు.
డిస్కంల పేరు చెప్పి జగన్ విద్యుత్ చార్జీలు పెంచినా డిస్కంలకు ఒరిగింది ఏమీ లేదని ఆ అప్పులన్నీ దుర్వినియోగం అయ్యాయన్నారు. వైసీపీ హయాంలో అప్పులు 79 శాతం పెరిగాయన్నారు. అప్పులు తెస్తే తప్ప డిస్కంలు నడవలేని స్థితికి తెచ్చారన్నారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలు, ఇతర మొత్తాలు కలిపి ఇప్పటికి రూ.34,954 కోట్లను బకాయిలుగా ఉన్నాయి. డిస్కంల అప్పులు కట్టడానికి మళ్లీ మళ్లీ అప్పులు చేశారని చేసి ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారని మంత్రి గొట్టి పాటి రికుమార్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఉన్న పరిస్థితిని మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని ..పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నామన్నారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని ...దీనికి ఆనాటి ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. వాటి పని తీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రేటింగ్ లో కూడా మన డిస్కంలు ‘ఏ’ నుంచి బీ,సీ,డీ కేటగిరిలకు పడిపోయాయని.. ఇంత కంటే దారుణమైన పాలన ఎక్కడ ఉంటుందని ప్రశ్నినించారు. డిస్కంల రేటింగ్ పడిపోవడంతో అప్పులపై వడ్డీ రేటు కూడా పెరిగిందని మంత్ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు విధానపరమైన నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరులో ‘ఏ’ రేటింగ్ ఉండేదన్నారు. దాన్ని దిగజార్చి.. డీ కేటగిరీకి తీసుకెళ్లారని మంత్రి ఆరోపంచారు.
విభజన సమయంలో ఏపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. సవాళ్లు మనకు కొత్తేమీ కాదని గొట్టి పాటి రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో చంద్రబాబు నాయుడు కు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని గుర్తు చేశారు. సీఎం ఇప్పుడు విద్యుత్ పై ప్రత్యేక శ్రధ్ద పెట్టారని.. అప్పులను తగ్గించి, డిస్కంలను గాడిలో పెట్టేలా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రేటింగ్ ల్లో ఏ ప్లస్ కోసం తాము ఆరాటపడబోమనికానీ పనికి తగ్గ ఫలితాలు రానున్న రోజుల్లో ప్రజలు చూస్తారని భరోసా ఇచ్చారు. ఎట్టిపరిస్థితిల్లో కూడా ప్రజల మీద అధిక భారం వేసే ప్రసక్తి లేదని గొట్టిపాటి హామీ ఇచ్చారు.