Posani : నంది అవార్డులకు కులం - అందుకే తిరస్కరించానని పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు !
నంది అవార్డులు కమ్మ అవార్డులని అందుకే గతంలో తీసుకోలేదని పోసాని కృష్ణమురళీ తెలిపారు. నంది అవార్డులు ఇవ్వాలా వద్దా అన్నది ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.
Posani : నంది అవార్డులపై ఎపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా ప్రారంభిస్తోన్న ఏపీఎస్ఎఫ్ఎల్ ఛానెల్ కు పోసాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇందు కోసం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నటుడు అలీతో పాటుగా ఆయన పాల్గొన్నారు. సినీ పరిశ్రమలో నంది అవార్డులకు ఎంతో ప్రత్యేకత ఉందని... గతంలో ఈ రెండు ప్రాంతాలకు ఈ రెండు, ఆ రెండు ప్రాంతానికి ఆ రెండు అవార్డులను ఇవ్వాలని అనుకునేవారన్నారు. దీనిపై నేను అప్పుడే ప్రశ్నించానని అందుకే పోసానికి నంది ఇవ్వకూడదు అనుకున్నారన్నరు. కొంత మంది రైటర్ లు, ఆర్టిస్టులు నందులను పంచుకునేవారని విమర్శంచారు.
అప్పట్లో ఓ సారి నంది అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు కానీ ఇవ్వలేదు. తనకు టెంపర్ మూవీకి నంది అవార్డు వచ్చిందని.. తప్పదు అన్నట్టుగా ఇచ్చారన్నారు. కానీ, నేను నంది ని తిరస్కరించాను. నాకు అది కమ్మ అవార్డు లాగా అనిపించింది. అందుకే దాన్ని తిరిగిచ్చేశానని ప్రకటించారు. నంది అవార్డుల అంశంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని. పాత వాళ్లకు ఇవ్వాలా? లేదా కొత్త వారితో కొత్తగా స్టార్ట్ చేయాలా? అనే విషయంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని కృష్ణమురళీ చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వం విడుదలైన రోజే కొత్త సినిమాలను ఏపీఎస్ఎఫ్ఎల్ ఛానెల్ లో టెలికాస్ట్ చేయనున్నామన్నారు. ఒక్కో సినిమాకు రూ.99 ఛార్జ్ చేస్తామని.. 24 గంటల లోపు ఎన్ని సార్లైనా సినిమాను చూడవచ్చని పోసాని తెలిపారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఈ ఛానెల్ అందుబాటులో ఉందన్‌నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇక్కడ సినిమాలకు 90 శాతం సబ్సిడీ ఇవ్వబోతున్నామని... చిన్న సినిమాలకు ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదని ప్రకటించారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అందరికీ సాధ్యపడదు. అంతదాకా ఎందుకు థియేటర్‌లో సినిమా చూడటం కూడా చాలామందికి సాధ్యం కాని అంశమేనన్నారు. లెటూర్లలో ఉన్నవాళ్లు, మారుమూల గ్రామాల్లో నివసించేవారికి థియేటర్ అందుబాటులో ఉండదు. దీంతో వారు సినిమాలు రిలీజైన వెంటనే చూడలేరు. ఓటీటీలకు వచ్చేదాకా ఆగాల్సిందే! అయితే వారికి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఏపీఎస్‌ఎఫెల్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురాగా ఇప్పుడేకంగా సినిమాలను డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పుడు ఓటీటీ కోసం సినిమాలు చేస్తున్నారు. రేపు ఫైబర్ నెట్ కోసం సినిమాలు తీస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.