Andhra Liquor Scam: వైసీపీలో రూ.11 కోట్ల కలకలం - లిక్కర్ స్కామ్‌వి కాదని వాదన - కోర్టులో కేసిరెడ్డి అఫిడవిట్
11 crore seized : హైదరాబాద్ శివారులో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న 11 కోట్లుపై రాజకీయం ప్రారంభమయింది. ఆ డబ్బులకు లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదని వైసీపీ నేతలంటున్నారు.

AP Liquor Scam Updates: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ స్కామ్‌లో ఏ 40గా ఉన్న వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి దుబాయ్ నుంచి రాగానే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నరాు. ఆయన ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద ఓ ఫాంహౌస్ లో దాచిన రూ. 11 కోట్ల నగదను స్వాధీనం చేసుకున్నారు. ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకారిచారు. కాచారం ఫార్మ్ హౌస్‌లో సిట్ దాడులు.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.నగదుతో పాటు వరుణ్ ను విజయవాడకు తరలించారు. విజయవాడ సిట్ కార్యాలయంలో వరుణ్ ని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ బయటపడగానే ఎవరు విదేశాలకు పంపించారు.. అవసరాలకు డబ్బులు ఎవరు ఇచ్చారు..?. నగదు అక్రమ రవాణా ఎలా చేశారు అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. విచారణ తర్వాత వరుణ్ ను కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అయితే కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ సీజ్ చేశామని చెబుతున్న 11 కోట్ల రూపాయలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హైదరాబాద్‌లోని ఫామ్ హౌజ్‌లో సీజ్ చేసిన డబ్బు కూడా నాది కాదు. ఆ ఫామ్ హౌజ్ తీగల విజయేందర్‌రెడ్డిదేనన్నారు.విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజ్, హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్నాయన్నారు. కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఆయన లావాదేవీలు చేస్తారు. విజయేందర్‌రెడ్డికి చెందిన ఆరెట్ హాస్పిటల్‌లో నా భార్య చిన్న వాటాదారు మాత్రమేనని అఫిడవిట్ లో చెప్పుకొచ్చారు. అదికాక విజయేందర్‌రెడ్డితో నాకు మరే ఇతర సంబంధం లేదన్నారు.
ఏపీ లిక్కర్ కేసులో కీలక ట్విస్టు
— vams (@itsnotme_1214) July 30, 2025
ఆ రూ.11 కోట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు.ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి అఫిడవిట్
సిట్ చెప్తున్నవన్నీ అసత్యాలే..
ఆ ఫాంహౌస్ యజమాని విజయానందరెడ్డికి వ్యాపారాలున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీతోపాటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి pic.twitter.com/apnGU8YFto
వైసీపీ కూడా హైదరాబాద్‌లో దొరికినవి లిక్కర్ స్కాం సొమ్ముకాదని వాదిస్తోంది. ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ కేసులో అన్నీ కట్టుకథలే చెబుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, మా పార్టీని టార్గెట్ చేసి, ఈ తప్పుడు లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం, జగన్‌ని రాజకీయంగా అడ్డుకోవడం కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్ తో మాట్లాడి ఏదో ప్యాకేజీ సెట్ చేసుకోవడం వీళ్లకి సాధ్యం కాదు.. కాబట్టి, ఏదో ఒక రకంగా ఆయన్ని జైల్లో పెట్టి, పార్టీని లెగలేకుండా చేయాలనే ఈ సామూహిక కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
మరో వైపు హైదరాబాద్ లో రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో ట్రెజరి లేదా ఐటీ అధికారులకు జమ చేస్తారు.





















