Kuppam Cases: మూడు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన కుప్పం పోలీసులు ! చంద్రబాబు పేరు ఉందా లేదా ?
కుప్పం చంద్రబాబు టూర్‌లో జరిగిన ఘటనలపై మూడు నాన్ బెయిలబుల్ కేసులు పోలీసులు నమోదు చేశారు.
Kuppam Cases : కుప్పంలో అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించడం, పోలీసులతో ఘర్షణ పడిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు, నేతలు పోలీసులపై దాడి, విధులను అడ్డుకోవడంపై మూడు కేసులు నమోదు అయ్యాయి. గొల్లపల్లి, శాంతిపురం, పెద్దూరు ఘటనపై ఈ కేసులు ఫైల్ చేశారు. పెద్దూరులో ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డిని దూషించిన ఘటనలో.. గొల్లపల్లి వద్ద సీఐ విధులకు ఆటంకం కల్గించినందుకు కేసు నమోదైంది. శాంతిపురంలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం మూడు ఘటనల్లో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులు.
రాష్ట్ర వ్యాప్తంగా నేతల ఇళ్లు, టీడీపీ కార్యాలయల దగ్గర పోలీసుల మోహరింపు
కుప్పం ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు రియాక్ట్ అవుతారేమో అన్న అనుమానంతో కీలక నేతలందర్నీ హౌస్ అరెస్టు చేశారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా నేతలందర్నీ ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దేని కోసం పోలీసులు ఈ కట్టడి చర్యలు తీసుకుంటున్నారో తెలియక నేతల అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా దీనిపై ఎలాంటి సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. ఇదేమి ఖర్మ పేరుతో టీడీపీ చేపట్టే కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి చంద్రబాబు ఇంటింటికీ తిరిగారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇలా ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు.
డీజీపీకి టీడీపీ లేఖ
టీడీపీ డీజీపీకి లేఖ రాసింది. జీవో నం.1 ను వెంటనే వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య లేఖలో కోరారు. చీకటి జీవో నం.1 విడుదల చేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అన్నారు. జీ.వో నం. 1 ఆర్టికల్ – 19 ద్వారా రాజ్యాంగం ప్రసాధించిತತన స్వేచ్చగా సంచరించే హక్కుకు భంగం కలిగిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంను కట్టడి చేయడమే జీవోనం. 1 ఉద్దేశంగా కనిపిస్తుంది అన్నారు. చీకటి జీవో ద్వారా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నట్లుగా కనిపిస్తోంది అన్నారు. 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీ సమయంలో కూడా ఈ రకంగా ఇండియన్ పోలీస్ యాక్టును దుర్వినియోగం చేయలేదని వర్ల గుర్తు చేశారు. తక్షణం చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలోనూ పలుమార్లు ఇతర సమస్యలపై డీజీపీకి టీడీపీ నేతలు లేఖ రాసినా ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు స్పందిస్తారని వారు అనుకోవడం లేదు. కానీ సమస్యను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన !
కుప్పంలో ఉన్న చంద్రబాబు.. రెండో రోజు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. క్లస్టర్ల వారీగా సమావేశఆలు నిర్వహిస్తున్నారు. బూత్ కన్వీనర్‌లతో భేటీ అవుతారు. వారితో మాట్లాడి భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. కుప్పంలో తన పర్యటనలపై విధించిన ఆంక్షలకు నిరసనగా పాదయాత్ర చేశారు.
అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో విజయవాడ తూర్పు వైసీపీలో వార్- యలమంచిలి రవి ఏం చేయబోతున్నారు?