(Source: ECI/ABP News/ABP Majha)
అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో విజయవాడ తూర్పు వైసీపీలో వార్- యలమంచిలి రవి ఏం చేయబోతున్నారు?
దేవినేని వర్సెస్ యలమంచిలి. ఇది ఇప్పటి పొలిటికల్ వార్ కాదు.. దశాబ్ధాలుగా నడుస్తున్న ఫైట్. కానీ ఆ రెండు ఫ్యామిలీకి చెందిన వారసులు ఒకే పార్టీలో ఉన్నారు. అందులో ఒకరికి టికెట్ వచ్చింది.
బెజవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు. నియోజకవర్గ సమీక్ష సమావేశంలో దేవినేని అవినాస్‌ను గెలిపించుకునే బాధ్యత మీత చేతుల్లో పెడుతున్నానంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో వైసీపీలో చర్చ మొదలైంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ శాసన సభ్యుడిగా పని చేస్తున్నారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలు వైసీపీనే గెల్చుకుంది. మరో నియోజకవర్గం తూర్పులో మాత్రం టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన గద్దె రామ్మెహన్ విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో ఆ ఒక్క నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీనే దక్కించుకోవాలని సీఎం జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వైసీపీ తూర్పులో మొదలైన అంతర్గ విభేదాలు
#YSJagan #DevineniAvinash pic.twitter.com/aJuZr15msm
— Devineni Avinash (@DevineniAvi) January 4, 2023
విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీలో అప్పుడే విభేదాలు మెదలయ్యాయి. సీఎంతో సమావేశానికి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్‌తో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, విజయావాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భువకుమార్, అదే నియోజకవర్గానికి చెందిన కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషుతోపాటుగా మరి కొందరు నాయకులు హజరయ్యారు. నియోజకవర్గంలో అత్యంత కీలకంగా ఉన్నమాజీ శాసన సభ్యుడు యలమంచిలి రవి సమావేశానికి హాజరు కాలేదు. ఆయనకు సమావేశానికి సంబంధిచిన సమాచారం కానీ ఆహ్వానం కూడా అందలేదని యలమంచిలి వర్గం చెబుతుంది. నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్‌కు యలమంచిలి రవి కుటుంబానికి మధ్య ఉన్న విభేదాలతోనే యలమంచిలి రవిని దూరం పెట్టారని ప్రచారం జరుగుతుంది. దేవినేని, యలమంచిలి కుటుంబాలు ఒకే సామాజిక వర్గం అయినప్పటికి రాజకీయాం ఆది నుంచి విభేదాలు ఉన్నాయి.
దేవినేని వర్సెస్ యలమంచిలి
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గతంలో యలమంచిలి నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆయన చనిపోవటంతో ఆయన కుమారుడు యలమంచిలి రవి ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయవాడ తూర్పులో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నెహ్రూపై టీడీపీ నుంచి ప్రత్యర్థిగా ఉన్న దేవినేని రాజశేఖర్ విజయం సాధించారు. యలమంచిలి, దేవినేని కుటుంబాల మధ్య రాజకీయంగా మొదటి నుంచి పోటీ సాగుతోంది. యలమంచిలి రవిపై విజయం సాధించాలని దేవినేని నెహ్రూ చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాలక్రమంలో ఇద్దరు నాయకులు చనిపోయారు. ఇప్పుడు యలమంచిలి, దేవినేని కుటుంబాలకు చెందిన వారసులు ఇరువురు వైసీపీలనే ఉన్నారు. అయితే యలమంచిలి రవి సైలెంట్ పాలిటిక్స్‌లో కొనసాగుతుండగా దేవినేని వారసుడిగా వచ్చిన దేవినేని అవినాష్ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ గా పని చేస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్న సీఎం విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలతో కూడా సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే అవినాష్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు యలమంచిలి రవి ఏం చేయబోతున్నారనే చర్చ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో నడుస్తోంది.