Janasena : జనసేన ఆవిర్భావ సభకూ అడ్డంకులు - ప్రభుత్వంపై నాదెండ్ల ఫైర్ !

మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ సభకు ఇంకా అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో హైకోర్టుకు వెళ్లాలని జనసేన నేతలు నిర్ణయించారు.

FOLLOW US: 

జనసేన పార్టీ ( Janasena ) ఆవిర్భావ సభకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మార్చి పధ్నాలుగో తేదీన మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 14న జ‌రిగే స‌భ‌కు ( anasena Aavirbhava Sabha ) అనుమ‌తి కోసం గత నెల 28వ తేదీన పర్మిషన్ ఇవ్వాలని  దరఖాస్తు చేశారు. కానీ పోలీసుల  నుంచి స్పందన లేదు. సహకరించాలని డీజీపీ కోరినా సహకరించడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్  ( Nadendal Manohar ) మండిపడుతున్నారు. సమయం దగ్గర పడుతూండటంతో జనసేన సభ నిర్వహణపై పర్మిషన్ ఇవ్వాలంటూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.  

పార్టీ ఆవిర్భావ సభకు వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని  సభ నిర్వహణ బాధ్యతను తీసుకున్న నాదెండ్ల మనోహర్ మండి పడుతున్నారు. పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫైర్ చలానాలు ( Fire Challans ) కూడా కట్టలేకపోతున్నామంటున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి కోవిడ్ నిబంధనలు అమల్లో లేవు. అన్ని కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నాయని సభకు అనుమతి ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని జనసేన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. జనసేన ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 12 కమిటీలు ఏర్పాటు చేసి సభా సన్నాహాలు చేస్తున్నారు.  స్థానికంగా, దూర ప్రాంతాల నుంచి వచ్చే జనసేన శ్రేణులు, నాయకులు, వీరమహిళలు, జనసేన అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. 

 మార్చి 14న జ‌రిగే ఆవిర్భావ స‌భ‌లో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ గురించి ప్ర‌క‌టిస్తాన‌ని ప‌వ‌న్ ( Pawan Kalyan ) ఇప్పటికే  ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు ఆవిర్భావ సభను నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఘనంగా నిర్వహంచారు.ఆ సందర్భంగా తన కార్యాచరణను పవన్ కల్యాణ్ ప్రకటించారు. అదే స్టైల్లో  పవన్ తన పార్టీ ప్రాధాన్యాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ తమకు తెలుసని.. వాటికి పరిష్కారం చూపించే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని జనసేన వర్గాలుచెబుతున్నాయి.  

గత ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో జత కట్టి ఎన్నికలకు వెళ్లిన పవన్ ఎదురుదెబ్బ తిన్నారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇరప్పుడు బీజేపీతో ఆయన దూరం జరుగుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు ఏ మాత్రం ఉపయోగం లేకపోగా.., మరింత నష్టమని ఆ పార్టీ నేతలు ఇప్పటికే పవన్‌కు చెబుతూ వస్తున్నారు. ఈ విషయంపైనా పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Published at : 09 Mar 2022 05:38 PM (IST) Tags: pawan kalyan Nadendla Manohar permission to Janasena sabha Janasena Avirbhava Sabha Janasena Sabha

సంబంధిత కథనాలు

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!

Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్ 

Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్ 

Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!

Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ -  టీడీపీ నిర్ణయం !

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!