By: ABP Desam | Updated at : 23 Mar 2022 03:45 PM (IST)
విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్
నాటు సారా మరణాలు, కల్తీ మద్యం బ్రాండ్లపై ప్రభుత్వ వైఖరిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలంయలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, బెందాళం అశోక్, మరికొంత మంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే వారు వస్తున్న సమాచరం తెలుసుకున్న పోలసులు ముందుగానే పెద్ద ఎత్తున మోహరించారు.
విరెడ్డి అసెంబ్లీలో ఎందుకలా చేస్తున్నారు? సెంటిమెంటా? భక్తా?
టీడీపీ కార్యకర్తలెవరూ అటువైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలువస్తున్న బస్సును కూడా అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు నడుచుకుంటూ ఎక్పైజ్ కార్యాలయానికి వెళ్లారు. దీంతో అక్కడ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితి తారస్థాయికి చేరడంతో ప్రసాదంపాడు వద్ద పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
బ్యాంకుల్లో పని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి.. లేకపోతే మళ్లీ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లోనే.. !
ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేలు పోలీసులను ప్రశ్నించారు. శాంతియుత నిరసనను అడ్డుకోవడం దారుణని.. అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోలేరని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కల్తీ సారా మరణాలు, కల్తీ మద్యం అమ్మకాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతీ రోజూ టీడీపీ సభ్యులు నోటీసులు ఇస్తున్నారు. అయితే చర్చకు అనుమతించడం లేదు. దీంతో వారు ఆందోళన చేస్తున్నారు. స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారు. ఈ కారణంగా టీడీపీ సభ్యులు సభకు హాజరవుతున్నారు కానీ వెంటనే సస్పెండ్ అవుతున్నారు. ఈ కారణంగా సభలో వారి వాయిస్ వినిపించడం లేదు.
గుడివాడ అమర్నాథ్‌పై పరువు నష్టం దావా - ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్న మాజీ నిఘా చీఫ్ !
ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీ సారా, కల్తీ మద్యంపై చర్చకు అనుమతిస్తే నిజాలేంటో బయటకు వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో అమ్ముతున్న బ్రాండ్లకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర సందర్భాల్లో చెబుతున్నారు కానీ చర్చకు మాత్రం అంగీకరించడం లేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు పోరాటం కొనసాగిస్తున్నారు. కల్తీ సారా, కల్తీ మద్యం బ్రాండ్లపై పోరాటమే ఎజెండాగా పెట్టుకున్నారు.
MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ కలకలం
Breaking News Live Updates : ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం
CM Jagan Davos Tour : సీఎం జగన్ దావోస్ పర్యటన, పెట్టుబడులే టార్గెట్!
Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 20th May 2022 : మళ్లీ పెరిగిన బంగారం ధరలు, కాస్త తగ్గిన వెండి ధరలు, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి