అన్వేషించండి

జగన్ మరో పాదయాత్ర: 2029 ఎన్నికల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్!

YSRCP: రెండేళ్ల తర్వాత జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్ని నాని ప్రకటించారు.జగన్ ప్రతి గ్రామానికీ వెళ్తాడన్నారు.

Perni Nani announced Jagan  padayatra: వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షు జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ ముఖ్య నేత పేర్ని నాని కూడా ఇదే ప్రకటన చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో రెండేళ్ల తర్వాత వైయస్ జగన్  పాదయాత్ర స్టార్ట్ అవుతుందిని..  రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి జగన్ గారు వస్తారు.. మీతో మాట్లాడతారని పేర్ని నాని తెలిపారు  ప్లీనరీ తర్వాత జిల్లా మీటింగ్స్.. ఆ తర్వాత పాదయాత్ర ఉంటుందన్నారు. 

రాష్ట్రంలోని ప్రజలతో నేరుగా సంబంధం బలోపేతం చేయడం, యువతను సమీకరించడానికి జగన్ పాదయాత్ర చేయాలనుకుంటున్నారు.   జగన్ ఈ పాదయాత్రను 2029 ఎన్నికలకు ముందు పార్టీని పునరుద్ధరించేందుకు ఒక వ్యూహంగా ఖరారు చేసుకున్నారు.  ఈ పాదయాత్ర జిల్లా స్థాయి సమావేశాలు , YSRCP ప్లీనరీ సమావేశం తర్వాత ప్రారంభమవుతుందని ఇప్పటికే ప్రకటించారు.  

గతంలో జగన్  ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 2017 నుంచి 2019 వరకు  3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.  341 రోజులలో 134 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగింది.  ఈ సారి   పాదయాత్ర కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయిలో ప్రజలతో  మాట్లాడుతూ సాగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ పాదయాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తుందని, ప్రత్యేకించి రైతులు, మహిళలు, యువత, మరియు వెనుకబడిన వర్గాల సమస్యలపై దృష్టి సారిస్తుందని జగన్ చెబుతున్నారు. 

 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో YSRCP 151 నుండి 11 సీట్లకు పడిపోయింది. జగన్ తన పార్టీని పునరుద్ధరించేందుకు ఈ పాదయాత్ర మాత్రమే మార్గంగా భావిస్తున్నారు.   పాదయాత్రకు ముందు, జగన్ జిల్లా స్థాయి పర్యటనలు చేపడతారు. ఏపీ  రాజకీయాల్లో పాదయాత్రలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.  చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం ద్వారా 2014లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రతి ఎన్నికకు ముందు ప్రతిపక్ష నేతలు పాదయాత్ర చేయడం కామన్‌గా వస్తోంది.  2009లో చంద్రబాబు పాదయాత్ర చేయ లేదు కానీ.. బస్సు యాత్ర చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేకపోయింది. 

2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డికి బదులుగా ఆయన సోదరి షర్మిల  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాదయాత్ర చేశారు. కానీ టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత 2019  ఎన్నికల కోసం జగన్ పాదయాత్ర చేశారు. ఆయన ఘన విజయం సాధించారు. మళ్లీ  2024 ఎన్నికల కోసం టీడీపీ కోసం నారా లోకేష్ పాదయాత్ర చేశారు. టీడీపీ ఘన విజయం సాధించింది.  అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ..  రెండేళ్ల పాటు పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. 

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget