Pawan Fever : పవన్ కల్యాణ్‌కు జ్వరం - మూడు రోజులు ప్రచారానికి బ్రేక్ !
Andhra News : పవన్ ప్రచారానికి మూడు రోజులు బ్రేక్ పడింది. జ్వరం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. పవన్ ఆరోగ్యం సరిగా లేనందున తెనాలి పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో ఈరోజు తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్ షో, బహిరంగ సభ రద్దు అయ్యాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారని జనసేనాని రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. రీ షెడ్యూల్ చేసిన పర్యటన వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. గత 4 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటించారు. రోడ్ షో, బహిరంగ సభలతో తీరిక లేకుండా గడిపారు. జ్వరం కారణంగా పవన్ హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే ఆయన చికిత్స, విశ్రాంతి తీసుకోనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ రావడం.. మరో రెండు వారాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న సమయంలో నిరంతరాయంగా ప్రచారం చేయాలని పవన్ కల్యాణ్ అనుకున్నారు. తమ పార్టీ అభ్యర్థులకు మద్దుతుగానే కాకుండా కూటమి సభ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ సమావేశాల్లో కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే జ్వరం కారణంగా మూడు రోజుల పాటు షెడ్యూల్ ఆగిపోనుంది. ఆ తర్వాత ప్రచారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ముందుగా అనుకున్న టూర్ ప్లాన్ అంతా మార్పు
ముందుగా అనుకున్న దాని ప్రకారం మడో తేదీన తెనాలి.. నాల్గో తేదీన నెల్లిమర్ల, ఐదో తేదీన అనకాపల్లి, ఆరున యలమంచలి, 7న పెందుర్తిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. అక్కడ కూడా రోడ్‌షోలు, బహిరంగ సభల్లో ప్రసగించనున్నారు. వారి విజయానికి కూటమి నేతలు సహకరించేలా వారితో భేటీ కావాల్సి ఉంది.
ఏదో తేదీన ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని కాకినాడ కు చేరుకుని కోస్తా జిల్లాల్లో ప్రచారం 8 నుంచి ప్రారంభించాలని ్నుకున్నారు. 9వ తేదీన ఉగాది రోజున పిఠాపురంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత కోనసీమ జిల్లాల్లోకి ప్రవేశించేలా చూసుకున్నారు. ఇలా పన్నెండో తేదీ వరకూ ప్రచారం ప్లాన్ చేశారు. జ్వరం కారణంగా మొత్తం షెడ్యూల్ అప్ సెట్ అయింది.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి
పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు టీడీపీ నుంచి వచ్చిన మండలి బుద్దప్రసాద్, నిమ్మక జయకృష్ణ పేర్లను ఖరారు చేశారు. దీంతో అన్నిస్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఇక ప్రచారాన్ని పూర్తి స్థాయిలో చేపట్టడమే మిగిలింది. పవన్ పర్యన రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభించేందుకు జనసేన వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు.