అన్వేషించండి

Pawan kalyan: సెజ్ లో విషవాయువు లీకేజీని అరికట్టలేరా - పవన్ కల్యాణ్

Pawan Kalyan: అచ్యుతాపురం సెజ్ వాయువు లీకై తరచూ ప్రమాదాలు జరగడం ఆందోళనకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లిప్తతే ఈ ఘటనకు కారణం అంటూ ఆరోపించారు.

Pawan kalyan: విశాఖపట్నం జిల్లా సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లో విష వాయు లీకేజీ విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఎస్ఈజెడ్ పారిశ్రామిక ప్రాంతంలో తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. విష వాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరం అని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలను ప్రభుత్వం అరికట్టలేదా అంటూ ప్రశ్నించారు. 

నెలక్రితం 400 మంది ఇప్పుడు 125 మంది..

ఇదే కంపెనీలో నెల క్రితమే ఇటువంటి ప్రమాదం జరిగి 400 మంది అస్వస్థతకు గురయ్యారని.. మళ్లీ అదే ఘటన పునరావృతమైందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటో అటు అధికారులు గానీ... ఇటు కంపెనీ ప్రతినిధులుగా చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పరవాడ, దువ్వాడ. అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టు పక్కల కాలనీవాసులు, గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని... ఏ విష వాయువు ప్రాణాలు తీస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో... ఎంత మంది ప్రాణాలను హరించిందో ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని పరిశ్రమల్లో పక్కా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించాలని సూచించారు.

అచ్యుతాపురం సెజ్ ప్రమాదాలను అరికట్టలేరా ? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/qfn0nwmWuZ

— JanaSena Party (@JanaSenaParty) August 4, 2022

">

మేలైన వైద్యం, నష్ట పరిహారం అందించాలి..

"ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి, కర్మాగాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టు పక్కన కాలనీవాసులు, గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఏ విష వాయులు ప్రాణాలు తీస్తుందో అని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు, ఎంతో అవసరం. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను ఫణంగా పెట్టి కాదు. 

పారిశ్రామిక ప్రమాదాలు నివారణకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా పని చేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ పకడ్బందీ చేపట్టాలి. ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి తావులేని విధంగా పని చేయాలి. ఎటువంటి వైఫల్యం ఎదురైనా అందుకు ప్రభుత్వంలోని పెద్దలు బాధ్యత వహించాలి. దుస్తుల కర్మాగారం వాయి ప్రమాదంలో అస్వస్తులైన మహిళా కార్మికులకు ప్రభుత్వం  మేలైన వైద్యాన్ని, నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు." అని జనసేనాని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Local Body Elections AP 2026: పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?
పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget