Pawan Kalyan: తిరుమల విషయంలో మరోసారి పవన్ సంచలన డిమాండ్ - సనాతన ధర్మబోర్డు ఏర్పాటుకు సరైన సమయమని ట్వీట్
Sanatana Dharma Board: సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ మరోసారి డిమాండ్ చేశారు. టీటీడీ కల్తీ నెయ్యి అంశంపై ఆయన మరోసారిస్పందించారు.

Pawan Kalyan demands formation of a Sanatana Dharma Board: తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో సీబీఐ ఇచ్చిన రిపోర్టుపై పవన్ కల్యాణ్ స్పంిదంచారు. 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు' ఏర్పాటుకు పిలుపునిచ్చారు. భక్తుల భావాలు దెబ్బతిన్నాయి, సెక్యులరిజం రెండు విధాలుగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. అన్ని పక్షాల సమ్మతితో దేశవ్యాప్తంగా అమలు చేయాలని అంటన్నారు. ట్వీట్‌లో పవన్ కల్యాణ్ టీటీడీ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, లడ్డూ ప్రసాదం భక్తులకు మానసిక బంధాన్ని వివరించారు.
"విశ్వవ్యాప్త సనాతనులకు తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం తీర్థక్షేత్రం కాదు. ఇది పవిత్ర ఆధ్యాత్మిక ప్రయాణం. తిరుపతి లడ్డూ కేవలం తినుబండారం కాదు; ఇది సామూహిక భావోద్వేగం - బంధువులు, కుటుంబ సభ్యులు, తెలియని వారితో కూడా పంచుకుంటాం, ఎందుకంటే ఇది సామూహిక విశ్వాసాన్ని, గాఢ భక్తిని సూచిస్తుంది. సగటున, ప్రతి సంవత్సరం 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలకు వస్తారు. సనాతనుల భావాలు, ఆచారాలు ఎగతాళి చేయబడితే లేదా బలహీనపరిస్తే, అది కేవలం బాధ కాదు; ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసం, భక్తిని బలహీనపరిచినట్లే. అని ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
సెక్యులరిజం రెండు విధాలుగా ఉండాలన్నారు. ధర్మానికి రక్షణ, గౌరవం చర్చనీయాంశం కాదు. మన సనాతన ధర్మం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని గుర్తుచేశారు. ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న నాగరికత అన్నారు. 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు'ను అన్ని పక్షాల సమ్మతితో ఏర్పాటు చేయడానికి.. సమయం వచ్చిందన్నారు.
"For the global Hindu community, Tirumala Tirupati Devasthanam is more than a pilgrimage center; it is a sacred spiritual sojourn. The Tirupati Laddu is not just a sweet; it is a shared emotion - we distribute it among friends, family and strangers alike, for it embodies our…
— Pawan Kalyan (@PawanKalyan) November 11, 2025
సీబీఐ సిట్ కోర్టుకు సమర్పించిన బయటపెట్టిన నివేదిక ప్రకారం, వైసీపీ హయాంలో (2019-2024) భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీవైష్ణవి డెయిరీల ద్వారా కల్తీ చేసిన నెయ్యి 68.17 లక్షల కేజీలు సరఫరా చేశారు. మొత్తం విలువ రూ. 250 కోట్లు. ఇది భక్తుల భావాలను దెబ్బతీసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్న, రసాయనాల సరఫరాదారు అజయ్ కుమార్ సుగంధ్‌లను అరెస్టు చేశారు. మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. సిట్ ఈ నెల 13న సుబ్బారెడ్డిని విచారించనుంది.
వివాదం ప్రారంభమైనప్పుడే పవన్ కల్యాణ్ "ఇది సనాతన ధర్మంపై దాడి" అని, 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ఏర్పాటుకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు, సిట్ నివేదికలు బయటపడుతున్న సమయంలో మరోసారి అదే డిమాండ్ వినిపించారు.





















