అన్వేషించండి

TTD Case: వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు -సిట్ ఎదుట హాజరైన ధర్మారెడ్డి - నెయ్యి కల్తీ కేసులో సిబీఐ సిట్ దూకుడు

Adulterated ghee case: టీటీడీ నెయ్యి కల్తీ కేసులో వైవీ సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మాజీ ఈవో ధర్మారెడ్డిని పిలిపించి ప్రశ్నించింది.

CBI SIT on TTD Adulterated ghee case:   తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కల్తీ నెయ్యి సరఫరా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం  విచారణను వేగంగా నిర్వహిస్తోంది.  టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. నవంబరు 13  విచారణకు తప్పక హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో, వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఎ.వి. ధర్మారెడ్డి సోమవారం సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.                            

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ విచారణలో సంచలన విషయాలు వెల్లడి        

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్, ఈ కేసులో భారీ కుట్రలు బయటపడ్డాయని, ఐదేళ్ల పాటు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని తేల్చింది. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీవైష్ణవి డెయిరీల ద్వారా 68.17 లక్షల కిలోలకు పైగా పామ్ ఆయిల్, రసాయనాలతో కల్తీ చేసిన నెయ్యి టీటీడీకి సరఫరా చేశారు. దీని మొత్తం విలువ రూ. 250 కోట్లకు పైగా ఉందని సిట్ నివేదికలు సూచిస్తున్నాయి.               

టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారంపై ప్రధానంగా అనుమానం              

వై.వి. సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది.  వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో, ల్యాబ్ నివేదికల్లో కల్తీ నెయ్యిగా తేలినప్పటికీ, సరఫరా కొనసాగించారని గుర్తించారు. ఎలాంటి చర్యలు తీర్చలేదని సిట్ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. ఇప్పటికే సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్న, రసాయనాల సరఫరాదారు అజయ్ కుమార్ సుగంధ్‌లను అరెస్టు చేశారు.   రూ. 25 ప్రతి కిలో కమిషన్ తీసుకున్నారని  సిట్ గుర్తించింది. సుబ్బారెడ్డి బ్యాంక్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని సిట్ ఆదేశించింది. అయితే సుబ్బారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన సిట్ ముందు హాజరయ్యే అవకాశాలు లేవని.. మరో వైరం రోజుల గడువుకోరుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నారు.              

విచారణకు హాజరైన మాజీ ఈవో ధర్మారెడ్డి            

మరోవైపు, మాజీ ఈవో ధర్మారెడ్డి సోమవారం తిరుపతిలోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.  సుమారు నాలుగు గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు.  వైసీపీ హయాంలో ఈవోగా ఉన్న సమయంలో భారీ మొత్తంలో కల్తీ నెయ్యి లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై ప్రశ్నించారు. ధర్మారెడ్డి పదవీకాలంలోని టెండర్లు, సరఫరాలు, నివేదికలపై లోతుగా విచారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వం మారిన తర్వాత ఆయన బయట కనిపించడం ఇదే మొదటి సారి.                           

టాప్ హెడ్ లైన్స్

AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Embed widget