Pawan Kalyan : జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ తల్లి అంజనా దేవీ విరాళం
Pawan Kalyan : జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర నిధికి పవన్ తల్లి అంజనా దేవి రూ.లక్షన్నర విరాళం అందించారు.
Pawan Kalyan : జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తల్లి అంజాదేవి విరాళం అందజేశారు. తన వంతు సాయంగా రూ. లక్షన్నర సాయం అందించారు. జనసేన పార్టీకి మరో రూ.లక్ష విరాళం అందజేశారు. పవన్ కల్యాణ్ తండ్రి వెంకట్రావు జయంతి సందర్భంగా ఈ విరాళం చెక్కును హైదరాబాద్‌లో పవన్‌కు అందజేశారు అంజాదేవి. తన తండ్రి పింఛను డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చినందుకు తల్లికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధి, జనసేన పార్టీకి విరాళం అందించిన తన తల్లికి కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని ఎందుకు కోరుకుంటానంటే అది మా ఫ్యామిలీకి భావోద్వేగంతో కూడుకున్న విషయం అన్నారు. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తానన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటామని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం కూడా పాల్గొన్నారు.
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాతృమూర్తి అంజనా దేవి గారు ఈ రోజు జనసేన కౌలు రైతు సంక్షేమ నిధికి లక్ష యాభై వేల రూపాయల విరాళం మరియు జనసేన పార్టీకి లక్ష రూపాయల విరాళం అందించారు. pic.twitter.com/975m9k3jww
— JanaSena Party (@JanaSenaParty) June 25, 2022
సీపీఎస్ రద్దు అందుకే