అన్వేషించండి

Janasena Party Structure Restructuring: పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం.. జనసైనికులే కాబోయే నాయకులు!

Janasena Membership Drive Sadhaks: కింది స్థాయిలో కష్టపడే జనసైనికులకే అవకాశాలు కల్పించాలని పవన్ భావిస్తున్నారు. అందుకే సమాచార సేకరణ కమిటీల్ని నియమించారు.

Pawan Kalyan Janasena Information Committees: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో భారీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కేడర్ ఆధారిత బలమైన నాయకత్వ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా, రాష్ట్రవ్యాప్తంగా  జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల  నియామకాన్ని చేపట్టారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, దశాబ్ద కాలంగా జెండా మోస్తున్న సామాన్య జనసైనికుల నుంచే భవిష్యత్ రాజకీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే బృహత్తర వ్యూహంతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సరికొత్త ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

ఈ సంస్థాగత మార్పుల్లో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అత్యంత పకడ్బందీగా ఈ సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కూడిన ఒక జంబో కమిటీ బాధ్యతలను చూస్తుంది. ఈ కమిటీల కూర్పులో ప్రతి పార్లమెంట్‌కు ఒక సీనియర్ పరిశీలకుడు, స్థానిక అంశాలపై పూర్తి అవగాహన ఉన్న ముగ్గురు సీనియర్ నాయకులు ఉంటారు. వీరితో పాటు ఏటా నిలకడగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ముగ్గురు 'సాధక్స్'ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్‌ను ఇందులో భాగస్వామ్యం చేశారు. వీరికి తగిన సాంకేతిక, పరిపాలనా సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా కేటాయించారు.

ఈ కమిటీల ప్రధాన విధి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో, నిస్వార్థంగా కష్టపడిన నాయకులు, సాధక్స్ , వీరమహిళల  సమగ్ర సమాచారాన్ని సేకరించడం. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించి, క్షేత్రస్థాయిలో వారి పనితీరు, ప్రజాదరణ, అంకితభావం మరియు నాయకత్వ లక్షణాలపై ఈ కమిటీలు సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తాయి. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుండి ఎన్నో కష్టనష్టాల నెదుర్కొని జనసేన జెండాను భుజాన మోస్తున్న అసలైన జనసైనికులను గుర్తించి, వారిని చట్టసభలకు వెళ్లే నాయకులుగా తీర్చిదిద్దడమే ఈ భారీ రాజకీయ కసరత్తు   ముఖ్య ఉద్దేశం.   

పార్లమెంట్ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే పార్టీలోని వివిధ అనుబంధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారిని వారి నైపుణ్యాల ఆధారంగా గుర్తించనున్నారు. నాయకులు, కార్యకర్తల ఆసక్తి ,  క్షేత్రస్థాయి సామర్థ్యానికి తగిన విధంగానే భవిష్యత్తులో వారికి పార్టీ పదవులు మరియు ప్రభుత్వ అనుబంధ బాధ్యతలు కేటాయించబడతాయి. కమిటీలు క్షేత్రస్థాయి నుంచి సేకరించి అందించే పూర్తి సమాచారాన్ని, నివేదికలను కూలంకషంగా పరిశీలించిన అనంతరం మాత్రమే వివిధ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తీసుకుంటారు. 
 
సార్వత్రిక ఎన్నికల తర్వాత కేవలం అధికారానికే పరిమితం కాకుండా.. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ కమిటీల ద్వారా గ్రౌండ్ లెవల్‌లో కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, తగిన ప్రాధాన్యత కల్పించేలా పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నారు. అర్హత, నిబద్ధత మాత్రమే ప్రామాణికంగా సాగుతున్న ఈ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతం జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Seed Access Road: అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి! సీడ్ యాక్సెస్‌ ఇ-3 రహదారి, స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం!
అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి! సీడ్ యాక్సెస్‌ ఇ-3 రహదారి, స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం!
Breaking News: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
Embed widget