Pawan Kalyan Donations : దాన కర్ణుడు పవన్ కల్యాణ్ - వ్యక్తిగత ఆదాయం నుంచి రూ.6 కోట్లు విరాళం !
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ దానకర్ణుడిగా మారారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి వరదల బాధితుల కోసం ఆరు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇందులో రూ.కోటి తెలంగాణకు ఇచ్చారు.
Pawan Kalyan announced his own income of 6 crores : తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వరద కష్టాల విషయంలో ప్రజల్ని ఆదుకునేందుకు అనేక మంది విరాళాలిస్తున్నారు. అయితే అందరిలో కల్లా దానకర్ణుడిగా పవన్ కల్యాణ్ నిలిచారు. ఆయన మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు వ్యక్తిగతంగా రూ. కోటి విరాళం ప్రకటించారు. బుధవారం.. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వరద ముంపును ఎదుర్కొన్న నాలుగు వందల గ్రామాలకు వ్యక్తిగతంగా ఒక్కో పంచాయతీకి రూ. లక్ష ప్రకటించారు. అలాగే తెలంగాణకు మరో రూ. కోటి ప్రకటించారు. అంటే మొత్తం ఆరు కోట్ల రూపాయలు వ్యక్తిగత సొమ్మును విరాళంగా ఇచ్చారు.
కార్పొరేట్ సంస్థలను మించి సాయం చేసిన పవన్
సాధారణంగా కార్పొరేట్ సంస్థలు ఇలా రూ.కోట్ల రూపాయల సాయం చేస్తూంటాయి. కానీ వ్యక్తిగతంగా రూ. కోట్లు ఇచ్చేవారు తక్కువ. కొంత మంది సినీ హీరోలు మాత్రమే ఇస్తారు. అయితే రెండు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి ఇచ్చిన వారు ఉన్నారు. ప్రభాస్ మాత్రం రెండు రాష్ట్రాలకు చెరో కోటి ఇచ్చారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అనూహ్యమైన స్పందన ఇచ్చారు. మొత్తంగా ఆరు కోట్ల రూపాయలను వరద బాధితుల కోసం ఇచ్చారు. నాలుగు వందల పంచాయతీలకు పవన్ వ్యక్తిగత ఖాతా నుంచి నాలుగు కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. పవన్ దాతృత్వం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్, హైడ్రాపై పవన్ కల్యాణ్ ప్రశంసలు
పార్టీని కూడా సొంత డబ్బుతోనే నడుపుతున్న పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎక్కువగా పార్టీ కి.. ప్రజలకు సేవ చేయడానికే ఉపయోగిస్తున్నారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం .. పెద్ద ఎత్తున విరాళం ఇచ్చారు. పార్టీకి వచ్చే విరాళాలు.. పార్టీ నడపడానికి సరిపోకపోయినా ఆయన సొంత డబ్బుతో పార్టీ నడుపుతున్నారు. తనకు వచ్చే ఆదాయంలో అత్యధిక ఇలా విరాళాల రూపంలో పవన్ కల్యాణ్ ఇచ్చేస్తూంటారు.
వరద బాధితులకు నారా భువనేశ్వరి సాయం- రెండు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం
పంచాయతీ రాజ్ ఉద్యోగుల విరాళం
పవన్ కల్యాణ్ స్ఫూర్తి పంచాయతీరాజ్ ఉద్యోగుల్ని కదిలించింది. పంచాయతీ రాజ్ లో పని చేస్తున్న ఉద్యోగులు తమ వంతుగా ఒకరోజు జీతం 1200 రూపాయలు చొప్పున తమవంతుగా 14 కోట్లు విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులు .. వరద సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
పవన్ కల్యాణ్ స్ఫూర్తిగా సినీ పరిశ్రమలోని వారంతా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. విరాళాలు అందిస్తున్నారు. చిరంజీవి సహా అగ్రనటులంతా .. తమ విరాళ ప్రకటనలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరదలు ఉండటంతో.. రెండు రాష్ట్రాలకూ విరాళాలిస్తున్నారు.