అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కల్యాణ్ దృష్టిలో పడితే జెట్ స్పీడే - సోషల్ మీడియాలో పిల్లల పోస్టు చూసి రోడ్ మంజూరు

Nellore: సోషల్ మీడియాలో పిల్లలు తమ ఊరి రోడ్డు కోసం విజ్ఞప్తి చేయడంతో పవన్ వెంటనే మంజూరు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యలపై ఎంత వేగంగా స్పందిస్తుందో డిప్యూటీ సీఎం మరోసారి చూపించారు.

Deputy CM Pawan Reaction:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు వ్యక్తం చేసిన ఆవేదనకు స్పందించి, తక్షణమే రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యలపై ఎంత వేగంగా స్పందిస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
  
విద్యార్థుల పిలుపు.. పవన్ కళ్యాణ్ స్పందన 

"పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి" అంటూ నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లి విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. బురద రోడ్డులో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయారు. తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్, సంబంధిత అధికారులతో మాట్లాడి గజ్జలవారిపల్లి గ్రామ సమస్యపై పూర్తి వివరాలు సేకరించారు. ఆ విద్యార్థుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మంజూరు 

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో నెల్లూరు జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ అధికారులు రంగంలోకి దిగారు. గజ్జలవారిపల్లి నుంచి స్కూలుకు వెళ్లే 1.6 కిలోమీటర్ల మేర ఉన్న బురద రోడ్డును బాగు చేసేందుకు రూ. 86 లక్షలతో అంచనాలను రూపొందించారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ నిధులకు సంబంధించిన పరిపాలన అనుమతులు  మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే విద్యార్థులతో పాటు, పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఏళ్లనాటి రవాణా కష్టాలు తీరనున్నాయి.

ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి వెల్లువ 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం రోడ్ల నిర్మాణంలో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటికే 'పల్లె పండుగ' 1.0 ,  2.0 కార్యక్రమాల కింద సుమారు రూ. 55 కోట్ల నిధులతో 641 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా 437 రోడ్ల పనులు తుది దశకు చేరుకోగా, మరో 200 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి అదనంగా సాస్కీ  నిధుల నుంచి రూ. 9 కోట్లతో దుత్తలూరు, కొండాపురం, సీతారాంపురం , వింజమూరు మండలాల్లోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నారు.

 ప్రజా ప్రభుత్వం - తక్షణ పరిష్కారం 

సాధారణంగా ప్రభుత్వ పనులు మంజూరు కావడానికి నెలల సమయం పడుతుంది, కానీ గజ్జలవారిపల్లి ఘటనలో పవన్ కళ్యాణ్ చూపిన చొరవతో అది ఒక్కరోజులోనే సాధ్యమైంది. సమస్య ఏదైనా, అది ప్రజల నుంచి వస్తే తక్షణమే పరిష్కారం లభిస్తుందని ఈ ఘటనతో స్పష్టమైంది. తమ అభ్యర్థనపై స్పందించి రోడ్డు మంజూరు చేసినందుకు గజ్జలవారిపల్లి గ్రామస్తులు , విద్యార్థులు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.                                 

టాప్ హెడ్ లైన్స్

Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget