Panchaloha Idol: అర్ధరాత్రి ధాన్యం మూటల నుంచి వింత చప్పుడు.. వెళ్లి చూస్తే ఊహించని ట్విస్ట్
ఆ ఇంట్లో రాత్రి పూట వింతైన శబ్ధాలు.. భయపడుతూ నిద్రలేచి చూస్తే ఎవరూ లేరు.. సీన్ కట్ చేస్తే.. ఇంట్లో ఉన్న ధాన్యం మూటల మధ్యలో ఆ వస్తువును చూసి షాక్.. ఇంతకీ ఆ వస్తువు ఏంటో తెలుసా..?
![Panchaloha Idol: అర్ధరాత్రి ధాన్యం మూటల నుంచి వింత చప్పుడు.. వెళ్లి చూస్తే ఊహించని ట్విస్ట్ Panchaloha idol Found in home at midnight in Bandakadapalli chittoor district Panchaloha Idol: అర్ధరాత్రి ధాన్యం మూటల నుంచి వింత చప్పుడు.. వెళ్లి చూస్తే ఊహించని ట్విస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/15/e35b1465d78dc4a639da022d44eb8713_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సమాజంలో నిత్యం ఎన్నో వింతలు..మరెన్నో విడ్డూరాలు చూస్తూంటాం..కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. వేప చెట్టులో నుండి పాలు కారడం, వినాయకుడు పాలు తాగడం లాంటి ఘటనలు అనేకం వింటుంటాం. ఇలాంటివన్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంటాయి.
చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది ఓ ఇంటిలో నిద్రిస్తున్న వారికి వింతైన శబ్దాలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా నిద్ర లేచిన ఇంట్లోని వారు అసలు ఎందుకు ధాన్యం మూటల్లో నుంచి శబ్దాలు వస్తున్నాయనేది అర్థం కాక మూటలను ఎత్తి చూశారు. అయితే అక్కడున్న వస్తువుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఆ మూటల మధ్య దాగున్న ఆ వస్తువు ఏమిటో తెలియాలంటే.. వివరాల్లోకి వెళ్దాం..
చిత్తూరు జిల్లా పాకాల మండలం బండకాడపల్లిలో ఆశ్చర్యానికి గురి చేసే ఘటన వెలుగు చూసింది. బండకాడపల్లిలో నివాసం ఉంటున్న మురళి నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎప్పుడూ లేని విధంగా వింతైన శబ్దాలు రావడం మొదలైంది.. అయితే చుట్టు పక్కల నుంచి ఏదో జంతువులు శబ్దాలు చేస్తున్నాయనుకుని.. నిద్రలోకి జారుకున్నాడు. కానీ రాను రాను ఆ శబ్దాలు ఎక్కువ కావడం మొదలయ్యాయి. ఎంతసేపటికి ఆ శబ్దాలు ఆగకుండా వస్తుండడంతో ఇంటిలోని వారిని కూడా నిద్ర లేపాడు. దీంతో ఇంటికి చుట్టుపక్కల ప్రదేశాలను గాలించడం మొదలుపెట్టారు. కానీ ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించలేక పోయారు. మళ్లీ ఇంట్లోకి వచ్చి నిద్రలోకి జారుకున్నారు.
మళ్ళీ శబ్దాలు వినిపించడం మెుదలైంది. గమనించిన మురళి ఇంటిలో వేసిన వరి ధాన్యం మూటలను మధ్య అన్వేషణ కొనసాగించాడు. ఇంతలో మూటల మధ్యలో అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రత్యక్షం అయింది. దీంతో ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిన మురళి.. చుట్టు పక్కల వారిని పిలిపించి విగ్రహాన్ని బయటకు తీశాడు. వెంటనే అమ్మవారికి చుట్టుపక్కల వారు పూజలు చేయడం మొదలెట్టారు. అర్ధరాత్రి అమ్మవారు ప్రత్యక్షం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాంమని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక అడుగు ఎత్తు రెండు కిలోల బరువు ఉన్న అమ్మవారి పంచలోహ విగ్రహానికి గ్రామంలో గుడి నిర్మించేందుకు ప్రభుత్వం, ప్రజల సహకారం కావాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Also Read: AP High Court: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
Also Read: AP High Court: అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
Also Read: Tirupati: పాఠాలు చెప్పమంటే.. ప్రేమ పాఠాలు చెప్పాడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)