Tirupati: పాఠాలు చెప్పమంటే.. ప్రేమ పాఠాలు చెప్పాడు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే?
ఓ లెక్చరర్.. పాఠాలు చెప్పమంటే.. ప్రేమ పాఠాలు చెప్పాడు. పైగా.. విద్యార్థిని తీసుకుని ఎక్కడికో వెళ్లాడు.
బంగారు భవిష్యత్ కి బాటలు వేయాలన్నా.. భవిష్యత్ ను అంధకారం చేసుకోవాలన్న టీనేజ్ లైఫ్ అత్యంత ముఖ్యం.. పదో తరగతి నుంచి కాలేజ్ లైఫ్ కి అడుగు పెట్టగానే తెలిసి తెలియని వయస్సులో కొంత మంది చెడు మార్గాలు ఎంచుకుని బంగారు భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కలలు.. కనే బంగారు భవిష్యత్ ను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. విద్యార్థుల భవిష్యత్ ను బంగారు భవిష్యత్ గా తీర్చి దిద్దే బాధ్యత లెక్చరర్ తీసుకుంటారు. అలా కాకుండా విద్యా బుద్ధులు నేర్పించాల్సిన లెక్చరర్.. విద్యార్థితో ప్రేమయనం సాగించి.. ఆమెను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసి.. విద్యార్థి తల్లిదండ్రులు.. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.
తిరుపతి నగరంలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో ఓ యువతిని చేరింది. పదో తరగతిలో మంచి మార్కులతో పాసైన యువతి ప్రైవేట్ కళాశాలలో చేర్పిస్తే తమకు మంచి పేరు తీసుకొస్తుందని ఆ తల్లిదండ్రులు కళలు కన్నారు. అదే కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ గా పని చేస్తున్న కార్తికేయ మొదటి సంవత్సరం విద్యార్థులకు చదువు చెబుతూ ఓ విద్యార్థినితో చనువుగా వ్యవహరించే వాడు. కార్తికేయ చెప్పే మాటలకు ఆ అమ్మాయి లొంగిపోయింది.
విద్యార్థినిని నెమ్మదిగా కార్తికేయ బయటకు తీసుకెళ్ళి ప్రేమ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఇలా కొద్ది కాలం సాగింది. చదువుపై ధ్యాస తగ్గించి కార్తికేయ ప్రేమ మత్తుల్లో నిండా మునిగి పోయింది. ఆమెతో మాట్లేందుకు కార్తికేయ ఫోన్ ను కూడా కొనిచ్చాడు. నిత్యం ఫోన్ లో కార్తికేయ, విద్యార్థిని సంభాషించుకునే వారు. వీళ్ల ప్రేమ వ్యవహారం కాలేజీలోని విద్యార్థులకు తెలిసి పోయింది. ఎక్కడ విద్యార్థిని తల్లిదండ్రులకు తమ విషయం తెలిసి పోతుందేమో అని బయపడిన కార్తికేయ కాలేజీకి వచ్చిన ఆమెను తీసుకెళ్లిపోయాడు.
కాలేజీ సమయం దాటి పోయినా తమ కుమార్తే ఇంటికి రాక పోవడంతో ఆందోళనకు గురైనా రమ్య తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. కానీ ప్రయోజనం కనిపించలేదు.. కాలేజీ ప్రిన్సిపాల్ ను ఫోన్ ద్వారా సంప్రదించారు. కానీ కాలేజీ నుంచి ఇంటికి వెళ్లిందని చెప్పడంతో తమ కుమార్తే కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తెలుసుకున్నారు తల్లిదండ్రులు. కాలేజీ వద్దకు వచ్చి యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెప్పుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ వారిని నమ్మి అమ్మాయిని కాలేజీకి ఎలా పంపించాలని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తమకు ఎటువంటి న్యాయం జరగలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. నాలుగు రోజులుగా తమ బిడ్డ కనిపించకుండా ఆందోళన చెందుతున్నామని కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు.
Also Read: CM Jagan On Accident: జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
Also Read: తెలుగు చదవలేరు.. ఇంగ్లీష్‌లో మాట్లడలేరు... కరోనాతో అటకెక్కిన చదువులు
Also Read: AP Bus Accident: ప.గో.జిల్లాలో ఘోర ప్రమాదం.. వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది దుర్మరణం