అన్వేషించండి

Train Death : గుండె చికిత్స కోసం వెళ్తున్న ప్రయాణికుడి మృతి - విశాఖకు రైళ్ల రాకపోకల నిలిపివేతతో పోయిన ప్రాణం !

విశాఖకు రాకుండా రైళ్లు నిలిపేయడంతో వైద్యం కోసం వస్తున్న ఓ ఒడిషా ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.


Train Death :   అగ్నిపథ్ ఆందోళనలతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఎంతో మంది నష్టపోతున్నారు. కొంత మంది ఆర్థికంగా నష్టపోతున్నారు.. మరికొంత మంది ప్రాణాల మీదకూ వస్తోంది. ఆందోళనల్లో పాల్గొని తూటాలకు ప్రాణాలర్పించిన వారు కాదు అసలు ఆందోళనలతో ఏ సంబంధమూ లేకపోయినా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడుకునేందుకు కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. గుండెలవిసిపోయే ఈ ఘటన విశాఖ జిల్లా కొత్త వలసలో చోటు చేసుకుంది. 

అభివృద్ధి చేస్తే ఆత్మకూరుపై మంత్రులు, ఎమ్మెల్యేల దండయాత్ర ఎందుకు? వైఎస్ఆర్‌సీపీకి బీజేపీ సూటి ప్రశ్న !

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ ఆశావహులు సృష్టించిన విధ్వంసంతో ఏపీలోనూ అలర్ట్ అయ్యారు. సికింద్రాబాద్ స్టేషన్‌పై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో రైళ్ల రైకపోకల్ని నిలిపివేశారు. ఫలితంగా ఎక్కడి రైళ్లు అక్కడ ఆగిపోయాయి. ఆ రైళ్లలో ఉన్న ప్రయాణికులది ఒక్కో కథ.. ఒక్కో వ్యథ. 

రైళ్లను నిలిపివేయడంతో   కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ కొత్తవలసలో నిలిపివేశారు. అందులో ఒడిషాకు చెందిన జోగేష్ బెహరా కూడా ప్రయాణిస్తున్నారు. కుటంబసభ్యులు ఆయనకు గుండెకు చెందిన చికిత్స చేయించేందుకు విశాఖ తీసుకు వస్తున్నారు. ప్రయాణం సరిగ్గా జరిగి  ఉంటే ఉదయం విశాఖలో దిగి వెంటనే ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకునేవారు. కానీ ట్రైన్ కొత్త వలసలో ఆగిపోయింది. ఎంత సేపు కొత్త వలసలో ఎదురు చూసినా కదల్లేదు. మరో వైపు జోగేష్ బెహరా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. దీంతో ఇంకా ఎక్కువ సేపు వెయిట్ చేస్తే కష్టమని వెంటనే ఆయనను అంబులెన్స్‌లో  కొత్తవలస నుంచి విశాఖ తరలించేందుకు ప్రయత్నించారు. 

తెరుచుకున్న వైజాగ్ రైల్వే స్టేషన్, సర్వీసులను పునరుద్ధరించాలని రైల్వే అధికారులకు ఆదేశాలు

ఎంత ప్రయత్నించినా అంబులెన్స్ దొరకలేదు. దీంతో వెంటనే కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ప్రాథమిక చికిత్స చేస్తూండగానే బెహరా చనిపోయారు. ఎలాగైనా కుటుంబసభ్యుడ్ని కాపాడుకోవాలని వస్తున్న ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషాదం ఏమిటంటే ... కాసేపటికే ట్రైన్ కదిలి విశాఖ వెళ్లింది. ఇక విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదని.. అప్పటి వరకూ ప్రాణాలతో ఉన్న బెహరాను.. విగతజీవిగా అంబులెన్స్‌లో తీసుకుని ఒడిషా బయలుదేరారు. అగ్నిపథ్ ఆందోళనతో జోగేష్‌కు ఆయన ఫ్యామిలీకి ఎలాంటి సంబంధంలేదు. కానీ ఆయన ప్రాణం పోవడానికి మాత్రం పరోక్షంగా అవే కారణం అయ్యాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget