ఏపీ హైకోర్టుకు ఎన్ఆర్ఐలు.. ఐకాన్ టవర్ నిర్మాణానికి డబ్బులు కట్టినా పూర్తి చేయలేదని పిటిషన్
తమకు న్యాయం చేయాలంటూ ఏపీ హైకోర్టుకు ఎన్‌ఆర్‌ఐలు వెళ్లారు. ఐకాన్ టవర్ పేరిట డబ్బులు కట్టినా.. నిర్మాణం పూర్తి చేయలేదని తెలిపారు.

ఏపీ హైకోర్టును పలువురు ఎన్ఆర్ఐలు ఆశ్రయించారు. ఐకాన్ టవర్ పేరిట రూ.33 కోట్లు సీఆర్‌డీఏకి కట్టినా నిర్మాణం పూర్తి చేయలేదంటూ 18 మంది ఎన్‌ఆర్‌ఐలు పిటిషన్ వేశారు. టవర్ నిర్మాణం కోసం అమరావతిలో భూమి కొనగా మిగిలిన రూ.17 కోట్లు తమకు వడ్డీతో సహా ఇప్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో సీఆర్‌డీఏ మళ్లీ వచ్చింది కాబట్టి నిర్మాణం చేపట్టాలని లాయర్ జంధ్యాల వాదించారు. యాక్సిస్ బ్యాంక్‌లో డబ్బు వేరే అవసరలకు వాడకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును జంధ్యాల కోరారు.
వాదనలు విన్న న్యాయస్థానం.. ఏపీఎన్‌ఆర్‌టీ, రేరా, యాక్సిస్ బ్యాంక్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి హైకోర్టు వాయిదా వేసింది.
అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలో ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్ టవర్’ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 33 అంతస్తుల ఈ టవర్‌ను ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ నిర్మించేలా ప్రణాళికలు చేశారు. పూర్తిగా ప్రవాసాంధ్రుల పెట్టుబడితో, వారి కోసమే నిర్మించాలనుకున్నది ఈ టవర్.
ఈ భవనం ఆకృతుల్ని కొరియాకు చెందిన స్పేస్ గ్రూప్ సంస్థ రూపొందించింది. రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసిన గ్లోబ్‌లో రివాల్వింగ్ రెస్టారెంట్ ఉండేలా డిజైన్ చేశారు. ఈ భవనంలో 8 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం ఉండేలా ప్లాన్ వేశారు. 100 కంపెనీల ఏర్పాటుకు వీలుకల్పించేలా ప్లానింగ్ ఉంది. అయితే దీనిపైనే.. ఇప్పుడు ఎన్ఆర్ఐలు హైకోర్టును ఆశ్రయించారు.
Also Read: AP PRC Issue: జగన్ సర్కార్ కు మరో షాక్... ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ... జీతాల ప్రాసెస్ కు నో ...!
Also Read: Tirumala: తిరుమలకు వెళ్తున్నారా? అయితే టీకా వేసుకున్న ధ్రువపత్రం తప్పనిసరి
Also Read: సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.





















