అన్వేషించండి

CID Notice To Ramoji Rao : జూలై 5వ తేదీన విచారణకు రావాలి - రామోజీరావుకు ఏపీసీఐడీ నోటీసులు !

సీఐడీ ఆఫీసుకు రావాలని రామోజీరావు , శైలజాకిరణ్‌లకు నోటీసులు జారీ చేశారు.


CID Notice To Ramoji Rao : మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో నిందితులుగా ఉన్న రామోజీ రావు, శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి, జులై 5న గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో రామోజీ రావు ఏ1గా, శైలజా కిరణ్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీరావు నివాసంలో  రెండు విడతలుగా రామోజీరావు, శైలజా కిరణ్‌లను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. 
  
ఎఫ్ఐఆర్ లో రామోజీరావు,  శైలజా కిరణ్ పేర్లు                              

మొత్తం మూడు చట్టాల  కింద కేసులు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్  34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982  లోని సెక్షన్   76,79 ప్రకారం  ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది.  నమోదైన ఎఫ్ఐఆర్‌లలో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్,  అలాగే ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్,  అలాగే ఆయా బ్రాంచీల మేనేజర్ల పేర్లను చేర్చారు.

ఇప్పటికే ఆస్తులు అటాచ్                        

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థకు చెందిన ఆస్తులను   సీఐడీ ద్వారా అటాచ్‌ చేశారు.  మార్గదర్శికి సంబంధించిన రూ. వెయ్యికోట్ల ఆస్తులను రెండు విడతలుగా అటాచ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అటాచ్ చేసిన ఆస్తులను ఈ కేసు తేలేవరకూ ఎటువంటి క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేదని సీఐీ అదికారులు చెబుతున్నారు.   చిట్స్‌ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. సోదాల సమయంలో తమకు లభించిన ‘రశీదు’లు నిబంధనల అతిక్రమణ జరిగిందనడానికి కీలక ఆధారాలని సీఐడీ  తెలిపింది. 
 
మార్గదర్శిపై  సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్లలో తీవ్ర ఆరోపణలు                     

మార్గదర్శి భారీ స్కాం జరిగిందని సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపిస్తున్నారు.గతంలో ఢిల్లీలో పెట్టారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో పెట్టారు. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ను హైదరాబాద్‌లో ఆగస్టు 31, 1962న స్థాపించారు. నాలుగు రాష్ట్రాలలో మొత్తం 108 శాఖలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో శాఖలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం శాఖల సంఖ్య 37 కాగా 2,351 చిట్ గ్రూపులు ఉన్నాయి 1.04 లక్షల మంది చందాదారులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వార్షిక టర్నోవర్ రూ. 9,677 కోట్లుగా ఉంది. డిపాజిట్లు మళ్లిస్తున్నారని సీఐడీ..అసలు డిపాజిట్లే తీసుకోడం లేదని మార్గదర్శి వాదిస్తున్నాయి. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Bihar Youth: ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Bihar Youth: ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
Allu Arjun vs Siddharth: హీరో సిద్ధార్థ్‌కి మళ్లీ చుక్కలే.. ఇప్పుడప్పుడే అల్లు అర్జున్ వదిలేలా లేడుగా!
హీరో సిద్ధార్థ్‌కి మళ్లీ చుక్కలే.. ఇప్పుడప్పుడే అల్లు అర్జున్ వదిలేలా లేడుగా!
CMR College Bathroom Videos Issue: సొంగ కార్చుకుంటూ చూడాలంటూ ప్రీతి రెడ్డి  బూతులు- బాత్రూమ్ లో వీడియోలపై విచారణ: ఏబీపీతో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
సొంగ కార్చుకుంటూ చూడాలంటూ ప్రీతి రెడ్డి బూతులు- బాత్రూమ్ లో వీడియోలపై విచారణ: ఏబీపీతో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
Go Goa Gone: టూరిస్టులు లేక బోసిపోతున్న గోవా - బోర్ కొట్టేసిందా ? కొట్టి చంపుతూంటే ఎవరైనా వెళ్తారా?
టూరిస్టులు లేక బోసిపోతున్న గోవా - బోర్ కొట్టేసిందా ? కొట్టి చంపుతూంటే ఎవరైనా వెళ్తారా?
Embed widget