అన్వేషించండి

Jagan controversy: పులివెందుల వచ్చిన జగన్‌కు ప్రత్యేక పూజలు చేసిన ఒంటిమిట్ట రామాలయ అర్చకులు - టీటీడీ నోటీసులు జారీ

TTD: ఒంటిమిట్ట రామాలయ అర్చకులు వివాదంలో చిక్కుకున్నారు. పులివెందుల వచ్చిన జగన్ ను కలిసి వారు ప్రత్యేక ఆశీర్వచనం ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.

Notices to priests of Vonti Mitta Ram Temple:  ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించడం ప్రస్తుతం టీటీడీలో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.  వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చెందిన అర్చకులు ఎ. శ్రావణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, కె. పార్థసారథిలు ఇటీవల పులివెందులకు వెళ్లారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అయితే, టీటీడీ పరిధిలో పనిచేసే అర్చకులు ఎవరైనా సరే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ, ఈ ముగ్గురు అర్చకులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా వెళ్లడం నిబంధనల ఉల్లంఘనగా అధికారులు భావిస్తున్నారు.                         
 
కేవలం ఆశీర్వచనం ఇవ్వడమే కాకుండా, ఆలయానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన శేష వస్త్రాన్ని, రాములోరి తోమాలను, ముత్యాల తలంబ్రాలను జగన్‌కు అందజేశారు. సాధారణంగా ఇవి ప్రభుత్వం తరపున అధికారికంగా లేదా అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులకు ప్రోటోకాల్ ప్రకారం అందజేయాల్సి ఉంటుంది. అర్చకులు తమ స్వంత నిర్ణయంతో వీటిని తీసుకువెళ్లి అందజేయడం టీటీడీ నిబంధనలకు విరుద్ధమని, ఇది అర్చకుల అత్యుత్సాహమేనని అధికారులు పేర్కొంటున్నారు.   

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన టీటీడీ ఉప కార్యనిర్వహణాధికారి ఎ. ప్రశాంతి సంబంధిత అర్చకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టీటీడీ నిబంధనలను అతిక్రమించి, రాజకీయ నాయకుల నివాసాలకు వెళ్లి ఆశీర్వచనాలు అందించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు,  సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను వివరణ కోరారు. నోటీసులు అందుకున్న అర్చకులు శ్రావణ్ కుమార్, మనోజ్ కుమార్, పార్థసారథిలు రెండు రోజుల్లోగా తమ వివరణను లిఖితపూర్వకంగా సమర్పించాలని అధికారులు ఆదేశించారు. వారిచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.                       

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
YS Jagan On TET Exam: టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget