అన్వేషించండి

MLC Ananthababu: హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం - ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు గండం

MLC Ananthababu: హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు గండం పొంచి ఉంది. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది.

MLC Ananthababu  bail tension: మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు  చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ఆయన సాగించిన  ప్రయత్నాలు బహిర్గతం కావడంతో, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్  దాఖలైంది. 

 సాక్షుల కొనుగోలుకు  ఎమ్మెల్సీ ఎర వేశారని ఆరోపణలు

హత్య కేసు నుంచి బయటపడేందుకు అనంతబాబు సాక్షులను కొనేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయారని పోలీసులు కేసులు నమోదు చేశారు.   కీలక సాక్షులకు భారీ మొత్తంలో నగదు ఆశ చూపడమే కాకుండా, మాట వినని వారిని తీవ్రంగా హెచ్చరించినట్లు  సాక్షులు పోలీసులకు చెప్పారు. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్  సుబ్బారావు, రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు తన పరపతిని ఉపయోగించి వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని, తక్షణమే ఆయనను అదుపులోకి తీసుకోవాలని కోర్టును కోరారు.

 సుప్రీంకోర్టు నిబంధనల ఉల్లంఘన 

గతంలో పోలీసులు నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేయలేదన్న సాంకేతిక కారణంతో అనంతబాబుకు 2022 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, సాక్షులను ఎట్టిపరిస్థితుల్లోనూ కలవకూడదని, వారిని ప్రభావితం చేయకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆంక్షలు విధించింది. ఇప్పుడు సాక్షుల కొనుగోలుకు ప్రయత్నించడం ద్వారా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారని, ఇది బెయిల్ రద్దుకు బలమైన కారణమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనంతబాబు బయట ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని, సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తూ కేసును తారుమారు చేసే ప్రమాదం ఉందని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నేర స్వభావం కలిగిన వ్యక్తి స్వేచ్ఛగా తిరగడం వల్ల బాధితులకు న్యాయం జరగదని, కేసులో కీలకమైన ఆధారాలను మాయం చేసే అవకాశం ఉందని వాదించారు. నిందితుడి ప్రవర్తన వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.                                      

 ఆనాటి  డోర్ డెలివరీ దారుణం                                       

2022 మే నెలలో జరిగిన ఈ హత్య ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన వద్ద పనిచేసిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి, అనంతరం దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని స్వయంగా తన కారులోనే తెచ్చి బాధితుడి ఇంటి వద్ద  డోర్ డెలివరీ చేసిన తీరు  సంచలనం సృష్టించింది. తాజా పరిణామాలతో అనంతబాబుకు మళ్లీ జైలు గండం పొంచి ఉంది. ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమర్పించిన సాక్ష్యాధారాలతో కోర్టు ఏకీభవిస్తే, ఆయన బెయిల్ రద్దు కావడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.                            

టాప్ హెడ్ లైన్స్

SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget