Chiranjeevi : రాజకీయాల్లో లేను , రాజ్యసభ ఆఫర్ అవాస్తవం ... క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. వైఎస్ఆర్‌సీపీ నుంచి రాజ్యసభ ఆఫర్ అవాస్తమని చిరంజీవి ప్రకటించారు. ఆయనను జగన్ రాజ్యసభకు పంపుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు .
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ వస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ ఆయనకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చారని కొన్ని మీడియాల్లో జరిగుతున్న ప్రచారంపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ వస్తున్న వార్తలు ఊహాజనితాలని స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. తాను అలాంటి ఆఫర్లను కోరుకోనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గరలో డోకిపర్రు గ్రామంలో నిర్మించిన ఓ ఆలయంలో గోదాదేవి కల్యాణంలో పాల్గొనేందుకు కుటుంబసమేతంగా ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. బయటకు వచ్చి కారు ఎక్కే సమయంలో మీడియాతో మాట్లాడారు.
Also Read: జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారా ? నిజమా ? మైండ్ గేమా ?
సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి సమావేశం అయ్యారు. అప్పుడు రాజకీయ పరమైన చర్చలు జరిగాయని ఎవరూ అనుకోలేదు. అయితే అనూహ్యంగా కొన్ని ఇంగ్లిష్ పత్రికలు చిరంజీవికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ ఇచ్చారని వార్తలు ప్రచురించాయి. ఇది రాజకీయవర్గాల్లో విస్తృతమైన చర్చకు కారణం అయింది. చివరికి ఈ వార్తలపై చిరంజీవే క్లారిటీ ఇచ్చారు.
Also Read: పవన్ కల్యాణ్ న్యాయం కోసమే పోరాడతాడు - చిరంజీవి
రాజకీయాలకు దూరం అని చిరంజీవి స్పష్టంగా ప్రకటించడంతో ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలన్ని అవాస్తవమని తేలినట్లయింది. చిరంజీవి వైఎస్ఆర్‌సీపీ వైపు వెళ్తున్నారన్నట్లుగా ప్రచారం చేసింది..రాజకీయంగా మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి గత ఎన్నికలకు ముందే చిరంజీవి ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. చిరంజీవి ఫ్యాన్స్ అంతా ప్రత్యేక కార్యక్రమంలో జనసేన పార్టీలో చేరిపోయారు.
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
అయితే తరచూ చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు రాజ్యసభతో పాటు కేంద్రమంత్రి పదవిని కూడా బీజేపీ ఆఫర్ చేసిందని చెప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మళ్లీ ఆయనను యాక్టివ్ కావాలని కోరుతోంది. అయితే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలన్న తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లుగా తాజా ప్రకటనతో స్పష్టమయింది.
Also Read: పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి