AP PRC Row : పీఆర్సీపై అదే గోప్యత..మరోసారి ఉద్యోగ సంఘ నేతల అసంతృప్తి !
మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో పీఆర్సీపై స్పష్టత రాలేదు. ఏపీ ఆర్థిక పరిస్థితిని తాజా భేటీలో వివరించారు. దీంతో ఉద్యోగ నేతలు అసంతృప్తికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలకు మళ్లీ నిరాశే ఎదురయింది. పీఆర్సీ అంశంపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. అయితే ఈ సమావేశం కూడా ఎప్పట్లానే అసంపూర్తిగా ముగిసింది. ఉద్యోగ సంఘం నేతలు ఆగ్రహంతో వెనక్కి వచ్చేశారు. అవమానించేందుకే ఇలా సమావేశాలు పెట్టి ఏమీ చెప్పకుండా పంపుతున్నారని ఉద్యోగసంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిని మాత్రం చెప్పి పంపించాలని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. పీఆర్సీ అంశంపై ఎలాంటి పురోగతి లేదని. .. ఉద్యోగ, ఉపాధ్యాయులు బిల్లులు, ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ బిల్స్ అన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని బండి శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు బాగా ఇబ్బందిగా ఉందని.. ఉద్యోగ సంఘం నాయకులుగాతమపై తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. తాము పెట్టిన 71డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పీఆర్సీపై కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోబోమని.., ప్రతి ఐదేళ్లకుపీఆర్సీ ఇవ్వడం సంప్రదాయమని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తమకు పూర్తి సమాచారం ఉందని..అధికారులు సరైన వివరాలు చెప్పలేదని మరో ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. వస్తున్న ఆదాయం అంతా జీత భత్యాలకే పోతోందని ప్రభుత్వం చేస్తున్న వాదనసరి కాదన్నారు.
Also Read: గన్‌మెన్లను తిరస్కరించిన వంగవీటి.. రెక్కీ ఎవరు నిర్వహించారన్నదానిపై పోలీసుల అంతర్గత విచారణ !
ఉద్యోగ సంఘాల నేతలకు పీఆర్సీపై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. పీఆర్సీ అంశంపై ఇవాళ...రేపు అంటూ ప్రభుత్వం తిప్పుతూండటంతో ఉద్యోగ నేతలూ అసంతృప్తికి గురవుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులు ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎటూ తేల్చకపోవడంతో మరోసారి పోరు బాట పట్టాలనే ఆలోచన చేస్తున్నారు.
Also Read: సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాత పీఆర్సీపై ప్రకటన... ఉద్యోగులు ఆందోళనను వాయిదా వేసుకోవాలి
జనవరి మూడో తేదీ వరకు ప్రభఉత్వం నుంచి స్పందన వస్తుందని చూస్తామని.. లేకపోతే ఆ తర్వాత ఏ క్షణమైనా ఉద్యమంలోకి వెళ్తామని ఉద్యోగ సంఘం నేతలు అంటున్నారు. అయితే ఉద్యోగులకు ఎంతో మేలు చేయాలని ఉన్నా ఏపీ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని అందుకే.. అడిగినంత పీఆర్సీ ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోంది. జీతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటామని బుజ్జగిస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం 30 శాతానికిపైగా పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల ఆశలు ఆవిరి.. చేతులెత్తేసిన ప్రభుత్వం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి