News
News
X

Udayagiri YSRCP Fight : నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో మరో కుంపటి - ఉదయగిరిలో రోడ్డున పడ్డ రెండు వర్గాల గొడవలు !

నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఫ్లెక్సీలు చించేసుకుంటున్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ధర్నాలు చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

Udayagiri YSRCP Fight :  ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో వర్గ విభేదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదన ఉంది. నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. విచిత్రం ఏంటంటే.. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీలో రెండో గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ కూడా బలపడాలని చూస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర టైమ్ ఉండగా.. రెండో గ్రూప్ రాజకీయం మొదలు పెట్టింది. దీంతో ఎమ్మెల్యేల వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది.  

ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్గంతో పాటు ఆయనకు వ్యతిరేక వర్గం కూడా జోరుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  ఒక గ్రూపుకి, ఇంకో గ్రూపుకి అస్సలు పడట్లేదు. దీంతో ఫ్లెక్సీలు చించుకోవడం దగ్గర్నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం వరకు షరా మామూలే. దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో కొంతమంది వైసీపీ నాయకులు వేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గతంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా వేసిన ఫ్లెక్సీలను కూడా ఇలాగే వైరి వర్గాలు చించేశాయి. విచిత్రం ఏంటంటే ఇక్కడ టీడీపీకి ఎవరూ పని చెప్పలేదు. వైసీపీలోనే గ్రూపులు మొదలై ఒకరి ఫ్లెక్సీలు ఇంకొకరు చించేసుకుంటున్నారు. ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులే చించి వేశారని ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి నేతృత్వంలో నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఫ్లెక్సీలు చించేసినవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు పోలీస్ స్టేషన్ల ముందు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యతిరేక వర్గం  నిరసన ప్రదర్శన చేపట్టారు. దీని వెనక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ  నేతలే ఇలా రోడ్డెక్కడం నెల్లూరులో హాట్ టాపిక్ అయింది.   స్థానికంగా నాయకులు కొట్టుకోవడం, తిట్టుకోవడం వరకూ ఓకే, కానీ ఇలా జగన్ ఫ్లెక్సీలు చించేస్తే అధిష్టానానికి ఏమని మెసేజ్ ఇచ్చినట్టు. ఇలా అధినేత ఫ్లెక్సీలను చించేస్తూ రాజకీయం ఏంటి అని అంటున్నారు నాయకులు. గతంలో నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఉన్నారు. ఆయన హయాంలోనూ గొడవలున్నాయి, కానీ ఎప్పటికప్పుడు ఆయన మీటింగ్ లు పెట్టి సముదాయించేవారు. ఇప్పుడు జిల్లా పెత్తనం రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలోకి వెళ్లింది. ఆయన సౌమ్యుడు, మృదు స్వభావి. అజాత శత్రువుగా ఉండాలనేది ఆయన ఆలోచన. అలాంటి భావజాలం ఉన్న వ్యక్తి ఎవరినీ పిలిచి మాట్లాడలేరు, మందలించలేరు. దీంతో జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. అందులోనూ ద్వితీయ శ్రేణి నేతలు కూడా డైరెక్ట్ తమ నేతలకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నారు.  ఏది ఉన్నా నేరుగా సజ్జల దగ్గరకో, వైవీ సుబ్బారెడ్డి దగ్గరకో వెళ్తున్నారు. కుదిరితే నేరుగా జగన్ దగ్గరే తేల్చుకుంటామంటున్నారు. దీంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది. తిట్టుకోవడం, ఫ్లెక్సీలు చించుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టడం వరకు వెళ్లింది. దీంతో ఉదయగిరిలో వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి రోజు రోజుకు గందరగోళంగా మారుతోంది. 

Published at : 31 Dec 2022 05:08 PM (IST) Tags: AP Politics Nellore Update Nellore politics nellore ysrcp Nellore News

సంబంధిత కథనాలు

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

ఏందయ్యా ఇది-నువ్వు కూడానా? ఉదయగిరి ఎమ్మెల్యేకు మంత్రి కాకాణి క్లాస్!

ఏందయ్యా ఇది-నువ్వు కూడానా? ఉదయగిరి ఎమ్మెల్యేకు మంత్రి కాకాణి క్లాస్!

దమ్ముంటే వెంకటగిరి వచ్చి పోటీ చెయ్- ఆనం రాంనారాయణ రెడ్డికి నేదురుమల్లి సవాల్

దమ్ముంటే వెంకటగిరి వచ్చి పోటీ చెయ్- ఆనం రాంనారాయణ రెడ్డికి  నేదురుమల్లి సవాల్

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!

రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!

టాప్ స్టోరీస్

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?