News
News
వీడియోలు ఆటలు
X

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

అనిల్ సింగిల్ డిజిట్ మెజార్టీ ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. నోరు ఉంది కాబట్టే ఆయనకు జగన్ మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం సాయం పొందిన జగన్, తమకి అన్యాయం చేశారని మరోసారి మండిపడ్డారు. 

FOLLOW US: 
Share:

"పార్టీ అధికారంలోకి రాగానే జగన్, అనిల్ కి మంత్రి పదవి ఇచ్చారు, దానికి ఆయన బాగా పనిచేసి శెహభాష్ అనిపించుకున్నారు. నెల్లూరు నగరంలో అనిల్ గురించే చర్చ అంతా, ఆయనకి హారతి పడుతున్నారు. నెల్లూరు ప్రజల్లో ఎవరి నోట విన్నా అనిల్, అనిల్ అనే పేరే వినపడుతోంది. అనిల్ అనిల్ అని అందరూ అంటున్నారు, అనిల్ గెలుస్తాడని కాదు, ఓడిపోతాడని.." అంటూ అనిల్ పై సెటైర్లు పేల్చారు వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. 

గతంలో ఆయనెప్పుడూ ఇంత సెటైరిక్ గా మాట్లాడలేదు. తొలిసారి జగన్ గొప్ప మహానుభావుడు అంటూ కౌంటర్ ఇచ్చారు. అనిల్ ని కూడా ఆయన టార్గెట్ చేశారు. అయితే ఈ గొడవ ముందు మొదలు పెట్టింది అనిల్ కావడం విశేషం. తననిరెచ్చగొట్టి, తనతో మళ్లీ మాటలు అనిపించుకోవద్దని అన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. 

ఆ ముగ్గురు నెల్లూరు జిల్లాలో ఓడిపోవడం ఖాయం అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల గురించి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన కోటంరెడ్డిని టార్గెట్ చేద్దామనుకున్నారు, కానీ మేకపాటి బాగా హర్ట్ అయ్యారు. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ అనిల్ ని ఉతికి ఆరేశారు. అనిల్ సింగిల్ డిజిట్ మెజార్టీ ఎమ్మెల్యే అని ఎద్దేవా చేశారు. నోరు ఉంది కాబట్టే ఆయనకు జగన్ మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. గతంలో తాము చాలామందిని మోటుకున్నామని, వయసులో ఉన్నావు కదా అని రెచ్చిపోవద్దని అన్నారు. నెల్లూరు అంతా అనిల్ గురించే మాట్లాడుకుంటున్నారని, ఆయన ఓడిపోతారని అనుకుంటున్నారని సెటైర్లు పేల్చారు మేకపాటి. తమ కుటుంబం సాయం పొందిన జగన్, తమకి అన్యాయం చేశారని మరోసారి మండిపడ్డారు. 

మేకపాటి కుటుంబం పేరు చెప్పగానే అందరికీ ముందు గుర్తొచ్చేది పెద్దాయన రాజమోహన్ రెడ్డి, ఆ తర్వాత మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నా అర్థాంతరంగా ఆయన తనువు చాలించడంతో ఆయన స్థానంలో మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయినా కూడా పెద్దగా ఆయన లైమ్ లైట్లోకి రాలేదు. 2004, 2009లో వరుసగా కాంగ్రెస్ పార్టీనుంచి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చంద్రశేఖర్ రెడ్డి. ఆ తర్వాత 2012లో ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో నిలిచి గెలిచారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాంటి సీనియిర్ నేత, వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న నేతపై ఇటీవల ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీన్ని చాలాప్రెస్టీజియస్ గా తీసుకున్నారు మేకపాటి. అందుకే జగన్ ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. 

కోటంరెడ్డి దాదాపుగా టీడీపీలో చేరడం ఖాయం. ఆనం కూడా అటువైపే చూస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి కూడా అమరావతికి జై కొట్టి దాదాపుగా టీడీపీకి దగ్గరయ్యారు. ఇక మేకపాటి విషయం మాత్రం తేలడంలేదు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో టీడీపీతో ఎప్పుడూ మంతనాలు సాగించలేదు. ఆయన విషయంలో కూడా టీడీపీ అంత సీరియస్ గా ఆలోచించలేదు. అందుకే ఆయన ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసి గెలుస్తానంటున్నారు. 

Published at : 28 Mar 2023 05:10 PM (IST) Tags: Nellore Update nellore abp anil Mekapati Chandrasekhar Reddy Nellore News

సంబంధిత కథనాలు

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Udayagiri Treasure Mystery: చారిత్రక కోట ఉదయ'గిరి' గుప్తనిధుల కోసం ప్రాణాలు బలి!

Udayagiri Treasure Mystery: చారిత్రక కోట ఉదయ'గిరి' గుప్తనిధుల కోసం ప్రాణాలు బలి!

AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

AP KGBV: కేజీబీవీల్లో 1,358  పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!

AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!

AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!

AP Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet Decisions:  ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్-  ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!