అన్వేషించండి

Minister Kakani: పవన్ సినిమాల్లో హీరో, రాజకీయాల్లో జీరో - నిలకడ లేదు: మంత్రి కాకాణి

మూడు రాజధానులకు సరే అని చెప్పిన నోటితోనే నేడు వికేంద్రీకరణను పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నాడని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

Minister Kakani Govardhan Reddy Comments On Pawan Kalyan: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పొలిటికల్ బ్రోకర్ తరహాలో విన్యాసాలు చేస్తున్నాడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండి పడ్డారు. చంద్రబాబు స్నేహంతో పవన్ కి కూడా మతిమరుపు రోగం వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులకు సరే అని చెప్పిన నోటితోనే నేడు వికేంద్రీకరణను పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యతిరేకిస్తున్నాడని చెప్పారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో జీరో అని విమర్శించారు. ప్యాకేజీల పవన్ గా రాష్ట్ర ప్రజలు ఆయన్ను ఎప్పుడో గుర్తించారని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ఒక్క చోట కూడా ప్రజలు గెలిపించలేదని అన్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore), వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) విలేకరుల సమావేశం నిర్వహించారు.

నారా వారి రాజ్యం సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ని విశాఖ ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకొన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అంబేడ్కర్ రాజ్యాంగం అమలులో ఉండబట్టే పవన్ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారని అన్నారు. చంద్రబాబుకి సుపుత్రుడిపై నమ్మకం లేదని, దత్త పుత్రుడిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. 2024 లో కుప్పంలో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. చంద్రబాబు, పవన్ లాలూచీ వల్ల ఒరిగేదేమి లేదని అన్నారు. చంద్రబాబు, పవన్ మధ్య రహస్య ఒప్పందం జగమెరిగిన సత్యం అని అన్నారు.

పవన్ ఏ మాత్రం నిలకడ లేని వాడు. సంక్షేమ సారథి వైఎస్ జగన్ ని విమర్శించే అర్హత పవన్ కి లేదు. జగన్ ప్రభంజనానికి చంద్రబాబు అడ్రస్ గల్లంతు అయింది. రాజకీయ ఓనమాలు రాని నువ్వు గాలికి కొట్టుకుపోతావు. పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం. పొరపాటు చేస్తే ఎవరినీ విడిచి పెట్టబోం. పవన్ కళ్యాణ్ రాజ్యాంగానికి ఏమైనా అతీతుడా? సీఎం కావాలని పగటికలలు కంటే సరిపోదు. హుందాగా వ్యవహరించి మర్యాద కాపాడుకోవాలి’’ అని కాకాణి గోవర్థన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) అన్నారు.

రాజమండ్రిలో వైఎస్ఆర్ సీపీ - జనసేన మధ్య ఉద్రిక్తతలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం (అక్టోబరు 18) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ సీపీ నేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతూ ఓ సభ ఏర్పాటు చేసుకోగా, అదే సమయంలో అక్కడికి అమరావతి రైతుల మహాపాదయాత్ర చేరింది. వీరికి జనసేన, బీజేపీ మద్దతుగా నిలిచాయి. ఇదే సమయంలో మూడు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సభలోని కుర్చీలు విసురుకొన్నారు. అనంతరం స్థానిక ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తాము సభ ఏర్పాటు చేసుకుంటే బీజేపీ, జనసేన నేతలు రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసిరారని అన్నారు.

వైఎస్ఆర్ సీపీ, విపక్షాల పోటాపోటీ కార్యక్రమాలు స్థానికంగా రాజకీయ వేడిని సృష్టిస్తున్నాయి. అమరావతి రైతులు మహా పాదయాత్ర రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు నుంచి 9 గంటలకు ప్రారంభమై దేవీ చౌక్, ఆజాద్ ల మీదుగా సాగుతూ 10 గంటలకు ఆజాద్ చౌక్ వద్దకు చేరింది. అక్కడ అధికార వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాజమహేంద్రవరం అంతా అధికార వికేంద్రీకరణకు,  మూడు రాజధానులకు మద్దతుగా నగరం అంతా భారీ హార్డింగ్ లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అదేవిధంగా పలుచోట్ల రైతుల మహా పాదయాత్రకు అనుకూలంగా స్వాగతం చెబుతూ టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB Match Highlights | ఆర్సీబీ విక్టరీతో సంతోషంలో చెన్నై, ముంబై ఇండియన్స్ | ABP DesamSRH vs RCB Match Highlights | సన్ రైజర్స్ మీద మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ బౌలర్లు | IPL 2024 | ABPVirat Kohli Half Century | SRH vs RCB మ్యాచ్ లో మరో అర్థశతకం చేసిన విరాట్ కొహ్లీ | IPL 2024 | ABPSRH vs RCB Match Highlights | ఉప్పల్ లో సన్ రైజర్స్ కి ఓటమి రుచి చూపించిన ఆర్సీబీ | IPL 2024 | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
గన్‌పార్క్‌కు చేరిన రుణమాఫీ రాజకీయం- రాజీనామాకు రావాలని రేవంత్‌కు హరీష్‌ సవాల్
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
Renu Desai: పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్న రేణు దేశాయ్‌ పోస్ట్‌ - మాజీ భర్తకు కాకుండా, అనూహ్యంగా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా.. 
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు
Megha Akash: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మేఘ ఆకాశ్? ఆ ఫొటోకి అర్థం అదేనా?
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ITR 2024: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - మీకు ఏది సూటవుతుంది?
Embed widget