అన్వేషించండి

ఇస్రో-నాసా సంయుక్త పరిశోధనకు మహూర్తం ఫిక్స్!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరి­కా అంతరిక్ష పరిశోధన సంస్థ కలసి సూర్యుడిపై పరిశోధనలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా ఆదిత్యఎల్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి రెండు సంస్థలు సన్నద్ధమయ్యాయి.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరి­కా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కలసి సూర్యుడిపై పరిశోధనలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా ఆదిత్యఎల్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి రెండు సంస్థలు సన్నద్ధమయ్యాయి. 2018లో ఈ సంయుక్త ప్రాజెక్ట్ గురించి చర్చలు మొదలయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే 2020లోనే ఈ ప్రయోగం మొదలు కావాల్సింది. కానీ కొవిడ్ కారణంగా అర్థాంతరంగా వాయిదా పడింది. తాజాగా దీనికోసం మరో మహూర్తం ఖరారు చేసే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు. 2023 జనవరి నెలాఖరులో ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. 

కొవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టారు. ఇప్పుడు మళ్లీ మళ్లీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చిందని అంటున్నారు. కొత్తగా చేపట్టబోయే ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. ఈ ప్రయోగాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాలనుకోవడం మరో విశేషం. 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ–సి 56 రాకెట్‌ ద్వారా ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్రో దీనికి రంగం సిద్ధం చేస్తుండగా, నాసా ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆదిత్యఎల్-1 వివరాలు తెలియజేశారు. 

ఇప్పటికే జాబిల్లిపై పరిశోధనలకోసం ఇస్రో చంద్రయాన్-1, చంద్రయాన్-2 అంగారకుడిపై ప్రయోగాలకోసం మంగళయాన్-1 ప్రయోగాలు చేపట్టింది. అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాలు చేపట్టిన ఇస్రో అరుదైన ధనత సాధించింది. ఇప్పుడు సూర్యుడిపై ప్రయోగాలకు సిద్దమైంది. అయితే ఇందులో నాసా సాయం తీసుకుంటోంది. నాసాతో కలసి ఇస్రో సూర్యుడి పైకి ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. 

ఆదిత్య ఎల్-1 ప్రత్యేకతలు
ఉపగ్రహం బరువు 1,475 కిలోలు
పేలోడ్స్‌ బరువు 244 కిలోలు 
పేలోడ్స్ సంఖ్య 6
ద్రవ ఇంధనం బరువు 1,231 కిలోలు
ప్రయాణ సమయంల 177 రోజులు
భూమినుంచి దూరం 15లక్షల కిలోమీటర్లు..
సూర్యుడి వైపు ఈ ఉపగ్రహాన్ని తీసుకెళ్లడం కోసం ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ ఫర్‌ ఆర్బిట్‌ లోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత దాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్‌ బిందువు–1కి చేరుస్తారు. దీనికోసం 177రోజుల సమయం పడుతుందని అంచనా. అక్కడినుంచి ఈ ఉపగ్రహం ఎలాంటి అడ్డంకులు లేకుండా తన పని మొదలు పెడుతుంది. అంటే సూర్యుడిపై మార్పులను నిరంతరం పరిశోధిస్తుందనమాట. 

ఇస్రో-నాసా సంయుక్త పరిశోధనకు మహూర్తం ఫిక్స్!

ప్రాజెక్ట్ లక్ష్యం.. 
సూర్యుడి వెలుపల ఉన్న వలయాన్ని కరోనా అంటారు. సౌర గోళానికి కొన్ని వేల కిలో­మీటర్ల దూరం వరకు ఈకరోనా విస్తరించి ఉంటుంది. కరోనా వద్ద ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల కెల్విన్‌ వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్థారించారు. సూర్యుడి అంతర్భాగంలో  ఉష్ణోగ్రత 6వేల కెల్విన్‌ డిగ్రీల వరకు ఉంటుంది. ఈ వేడిపైన ఆది­త్య–ఎల్‌1 పరిశోధనలు చేస్తుంది. సౌర తుపాన్ల సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు ఏర్పడుతున్న అవరోధాలకు గల కారణాలు, వాటి నివారణోపాయాల్ని కూడా ఆదిత్య ఎల్-1 అంచనా వేస్తుంది. ఫోటోస్పియర్, క్రోమో స్పియర్ లపై మరింత అధ్యనం చేసి సమాచారాన్ని సేకరించి భూమికి పంపుతుంది ఆదిత్య ఎల్-1. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget