By: ABP Desam | Updated at : 24 Jun 2022 01:54 PM (IST)
ఆత్మకూరు బైపోల్ ప్రచారంలో రోజా
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ బాగా తగ్గింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 83.23 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఉప ఎన్నిక కాబట్టి పోల్ పర్సంటేజీ తగ్గుతుందని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే పర్సంటేజీ తగ్గింది. కేవలం 64.26 శాతం నమోదైంది. ఆత్మకూరులో మండలాల వారీగా లెక్కలు తీస్తే.. పోలింగ్ శాతం ఇలా ఉంది.
మండలం - పోల్ పర్సంటేజ్
ఆత్మకూరు - 63.69
మర్రిపాడు - 59.73
అనంతసాగరం - 65.12
ఏఎస్ పేట - 62.57
సంగం - 67.27
చేజర్ల - 67.74
ఆత్మకూరు ఉపఎన్నికల్లో మండలానికో ఇన్ చార్జ్ మంత్రిని, ఎమ్మెల్యేని ప్రచార సారథులుగా నియమించారు. మొత్తం 6 మండలాల్లో చేజర్లలో పోల్ పర్సంటేజీ అత్యధికంగా నమోదైంది. ఆ మండలానికి ఇన్ చార్జ్ మంత్రి రోజా. ఇన్ చార్జ్ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ప్రచారానికి రాకపోయినా రోజా మాత్రం మండలంలో కలియదిరిగారు. ఆమె తమకు అప్పగించిన మండలంతోపాటు.. ఇతర మండలాల్లో కూడా పర్యటించారు, రోడ్ షో లలో పాల్గొన్నారు. మొత్తమ్మీద తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు రోజా. చేజర్ల మండలంలో అత్యథిక పోల్ పర్సంటేజీ తెచ్చి చూపించారు.
ఇక పర్సంటేజీ అతి తక్కువగా నమోదైన మండలం మర్రిపాడు. మర్రిపాడులో 59.73 పర్సంటేజీ మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇది మేకపాటి సొంత మండలం. ఈ మండలంలోని బ్రాహ్మణ పల్లి మేకపాటి సొంత ఊరు. మేకపాటి కుటుంబం సొంత మండలంలోనే పోలింగ్ పర్సంటేజీ తక్కువగా నమోదు కావడం విశేషం. మర్రిపాడు మండలానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఇన్ చార్జ్ గా ఉంటూ ప్రచారం చేపట్టారు. అయినా ఇక్కడ పోలింగ్ పర్సంటేజీ తగ్గింది. ఆత్మకూరు రూరల్ ప్రాంతంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, తోపుదుర్తి ప్రకాష్.. పోల్ పర్సంటేజ్ ని పెంచగలిగారు. ఇక్కడ వైసీపీ ఇన్ చార్జ్ జితేంద్ర రెడ్డి, ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి.. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి ముఖ్య కారకులు. మొత్తమ్మీద అనుకున్నదానికంటే తక్కువ పోలింగ్ నమోదైనా.. మండలాల వారీగా లెక్క తీసుకుంటే.. ఆత్మకూరు రూరల్, చేజర్లలో పోలింగ్ పర్సంటేజీ బాగా వచ్చింది.
పర్సంటేజీ తగ్గడంతో అధికార పార్టీ అంచనా వేసిన లక్ష మెజార్టీ అనేది సాధ్యం కాకపోవచ్చనే అంచనాలున్నాయి. బీజేపీకి వచ్చే ఓట్లను బట్టి ఇక్కడ మెజార్టీ లెక్కలు మారిపోతాయి. ఇండిపెండెంట్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశముంది. ఈనెల 26న కౌంటింగ్ జరుగుతుంది. ఉప ఎన్నిక ఫలితాలు వెలువడతాయి.
ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్ ఆప్షన్లు
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
Top Headlines Today: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య యూటర్న్- రికార్డుల వేటలో గిల్- మార్నింగ్ టాప్ టెన్ న్యూస్
పిల్లికి భిక్షం పెట్టని వాళ్లు ప్రజలకేం చేస్తారు, సోదరులపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>