By: ABP Desam | Updated at : 10 May 2022 08:09 PM (IST)
ఏపీ మాజీ మంత్రి నారాయణ ఫైల్ ఫొటో
Ex Minister Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌ని ఖండిస్తూ.. ఆయన సొంత జిల్లా నెల్లూరులో టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కుమారుడి వర్ధం ఈరోజేనని, ఆయన కుటుంబం కొడుకుని స్మరించుకుంటూ తీరని దుఃఖంలో ఉన్న రోజున నారాయణని అరెస్ట్ చేయడం అన్యాయం అని అన్నారు టీడీపీ నేతలు. ఏపీ పోలీసులు నారాయణను హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం ఏపీలోని చిత్తూరుకు నారాయణ వాహనంలో ఆయనను తరలిస్తున్నారు.
కుమారుడి వర్ధంతి రోజే ఇలా వేధిస్తారా ?
నారాయణ విద్యాసంస్థల్ని దెబ్బ తీసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. మూడేళ్లుగా ఆయన్ను వేధిస్తున్నారని, ఏమీ చేయలేక, చివరకు టెన్త్ క్లాస్ పేపర్ లీజేకీ అనే కేసు పెట్టారని మండిపడ్డారు. నారాణని ఏమీ చేయలేరని అన్నారు. నారాయణ పై నమోదు చేసిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, జిల్లా పార్టీ అద్యక్షుడు అబ్దుల్ అజీజ్, సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..
చిత్తూరులోని నారాయణ స్కూల్స్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం ఏపీ మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా మాజీ మంత్రి నారాయణ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని, ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో మే 10న ఉదయం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మాజీ మంత్రి నారాయణతో పాటు, ఆయన సతీమణి రమాదేవిని అదుపులోకి తీసుకొని ఏపీలోని చిత్తూరుకు వారి వాహనంలోనే తరలిస్తున్నారు.
చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ఏమన్నారంటే..
చిత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశామన్నారు. పదోతరగతి ప్రశ్నపత్నం లీక్ కేసులో ఆయనను అరెస్టు చేశామన్నారు. ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తెలుసుకుని మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ప్రణాళిక ప్రకారమే నారాయణ విద్యాసంస్థలు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డాయని ఎస్పీ తెలిపారు. అటెండర్లు, సహాయ సిబ్బంది ద్వారా మాల్ ప్రాక్టీస్ చేశారన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. మిగతా విద్యాసంస్థల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పదో తరగతి పేపర్ల లీకేజి కేసులో సంబంధం ఉన్న అందరినీ అరెస్టు చేస్తామన్నారు. గతంలోనూ ఇలా లీక్ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ రిశాంత్‌రెడ్డి అన్నారు. లాంగ్వేజ్‌ల్లో ఎక్కువ మార్కుల కోసం ఇలా చేశారని భావిస్తున్నామన్నారు. నారాయణ సతీమణిని అరెస్టు చేయలేదన్నారు. ప్రశ్నపత్రాల లీక్ లో చాలా మంది పాత్ర ఉందని ఎస్పీ పేర్కొన్నారు.
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Nellore Wonder Kid: అక్షరాలతో ఆటలు, మ్యాథ్స్ తో గేమ్స్ - ఈ నెల్లూరు బాలిక సూపర్ అంతే
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Stock Market News: సెన్సెక్స్ - 250 నుంచి + 500కు! ఐరోపా మార్కెట్లు ఓపెనవ్వగానే ఎగబడ్డ ఇన్వెస్టర్లు!
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు