అన్వేషించండి

Former Minister Narayana Arrest : అడ్మిషన్లు పెంచుకునేందుకు పేపర్లు లీక్, టెక్నికల్ ఎవిడెన్స్ తో నారాయణను అరెస్టు చేశాం : ఎస్పీ

Former Minister Narayana Arrest : పదో తరగతి పేపర్ల లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ప్రణాళిక ప్రకారమే నారాయణ విద్యాసంస్థలు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డాయని ఎస్పీ తెలిపారు.

Former Minister Narayana Arrest : పదో తరగతి పేపర్ల లీక్ ఏపీలో పెను సంచలనం అయింది. పేపర్ల లీక్ కేసులో మాజీమంత్రి నారాయణను మంగళవారం చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణ అరెస్టు వివరాలను చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. చిత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశామన్నారు. పదోతరగతి ప్రశ్నపత్నం లీక్ కేసులో ఆయనను అరెస్టు చేశామన్నారు.  ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తెలుసుకుని మాల్ ప్రాక్టీస్‌ కు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ప్రణాళిక ప్రకారమే నారాయణ విద్యాసంస్థలు మాల్ ప్రాక్టీస్‌ కు పాల్పడ్డాయని ఎస్పీ తెలిపారు. అటెండర్లు, సహాయ సిబ్బంది ద్వారా మాల్ ప్రాక్టీస్‌ చేశారన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. మిగతా విద్యాసంస్థల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పదో తరగతి పేపర్ల లీకేజి కేసులో సంబంధం ఉన్న అందరినీ అరెస్టు చేస్తామన్నారు. గతంలోనూ ఇలా లీక్ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ రిశాంత్‌రెడ్డి అన్నారు. లాంగ్వేజ్‌ల్లో ఎక్కువ మార్కుల కోసం ఇలా చేశారని భావిస్తున్నామన్నారు. నారాయణ సతీమణిని అరెస్టు చేయలేదన్నారు. ప్రశ్నపత్రాల లీక్ లో చాలా మంది పాత్ర ఉందని ఎస్పీ పేర్కొన్నారు. 

హైదరాబాద్ లో అరెస్టు 

మాజీ మంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయనను పోలీసులు చిత్తూరుకు తరలించారు. మార్కుల కోసం మాల్ ప్రాక్టీస్ చేశారని ఎస్పీ తెలిపారు. ఇన్విజిలేటర్, వాటర్ బాయ్స్ ద్వారానే పేపర్ లీకేజ్ అయిందని ఎస్పీ రిశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పదో పరీక్షా ప్రశ్నాపత్రం లీకు కేసులో నారాయణను అరెస్ట్ చేశామన్నారు. ఆయన భార్యను అరెస్ట్ చేయలేదని ఎస్పీ చెప్పారు. ముందుగానే మాట్లాడి పెట్టుకుని పేపర్లను లీక్ చేశారని తెలిపారు. సమాధానాలు రాసి లోపలికి పంపే ప్రయత్నం జరిగిందని వెల్లడించారు. టెక్నినల్ ఎవిడెన్స్ దొరకడంతో నారాయణతో పాటు తిరుపతి డీన్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. 

నారాయణ భార్యను అరెస్టు చేయలేదు 

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ మాస్ కాపీయింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ను అరెస్టు చేయడం పక్క ఆధారాలతో జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన ఆధారాలతో టెక్నికల్ ఎవిడెన్స్ తో నారాయణ పాత్ర ఉందని స్పష్టంగా తెలియడంతో అరెస్టు చేశామన్నారు. మిగిలిన విద్యాసంస్థలకు సంబంధించి వారి పాత్రను కూడా విచారిస్తున్నామన్నారు. ప్రాథమిక ఆధారాలతో మంగళవారం ఉదయం నారాయణను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరికొద్ది సేపట్లో జడ్జి ముందు నారాయణను హాజరు పరుస్తామన్నారు. IPC సెక్షన్ 409, 408, 120, బి, 207 తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు నిర్ధారణ అయితే నిందితునికి పది సంవత్సరాల పాటు జైలుశిక్ష పడే అవకాశాలు ఉందన్నారు. ఈ కేసులో నారాయణ భార్యను అరెస్టు చేసినట్లు వస్తున్న వదంతులను ఎవరు కూడా నమ్మవద్దని స్పష్టం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget