By: ABP Desam | Updated at : 10 Mar 2023 09:07 PM (IST)
Edited By: jyothi
కోర్టు తీర్పుతో పదకొండేళ్లకు మళ్లీ ఉద్యోగంలో చేరిన ఎస్సై, అసలేం జరిగిందంటే?
AP High Court: ఓ వ్యక్తి చిన్న కేసులో ఇరుక్కున్నాడు. కానీ ఆ వివరాల్ని దరఖాస్తులో పేర్కొనకుండా ఎస్సై ఉద్యోగం సంపాదించాడు. నియామక ఉత్తర్వులు పొందాక.. తీరా కొన్ని రోజులకే ఓ మెమో జారీ చేస్తూ ఆయన నియామకాన్ని రద్దు చేసింది. ఏపీ పోలీసు రూల్స్ ప్రకారం ఆయన నియామకానికి అనర్హుడిగా పేర్కొంది. అయితే ఈ ఘటనపై అతను హైకోర్టును ఆశ్రయించగా... బాధిత ఎస్సైని విధుల్లోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం తీర్పుతో 11 సంవత్సరాల తర్వాత ఓ ఎస్సై మళ్లీ విధుల్లోకి చేరాడు.
అసలేం జరిగిందంటే..?
2008 సంవత్సరంలో ఎస్సై (SI Posts Notification) పోస్టుల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అయితే నెల్లూరుకు చెందిన ఎం విజయ భాస్కర్ పాల్గొని ఎంపిక అయ్యారు. నియామక ఉత్తర్వులు పొందాక 2012వ సంవత్సరం 18వ తేదీన ప్రభుత్వం ఓ మెమోను జారీ చేసింది. ఆయన నియామకాన్ని రద్దు చేసింది. ఏపీ పోలీసు రూల్స్ ప్రకారం ఆయన నియామకానికి అనర్హులుగా పేర్కొంది. 2004లో ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు అయిందని అయితే దాన్ని రెండేళ్ల తర్వాత అంటే 2006 జూన్ లో న్యాయస్థానం కొట్టేసిందనే విషయాన్ని దరఖాస్తులో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారనే కారణంతో నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఆ మెమోపై విజయ భాస్కర్ ఏపీఏటీని ఆశ్రయించారు. నియామకాన్ని రద్దు చేయడాన్ని ఏపీఏటీ తప్పు పడుతూ.. 2012లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ.. 2012 జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు, డీజీపీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అప్పట్లో విచారించిన కోర్టు ఏపీఏటీ తీర్పు అమలును నిలిపి వేసింది.
ఇటీవల హైకోర్టు విచారణ
ఇక అప్పటి నుంచి విజయ భాస్కర్ ఎస్సై విధుల్లో చేరడానికి వీల్లేకుండా పోయింది. ఇటీవల ఆ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. విజయ భాస్కర్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. కేసును దిగువ కోర్టు కొట్టివేయగా... దరఖాస్తులో ఆ విషయాన్ని ప్రస్తావించడం మరిచిపోయారని అన్నారు. మరోవైపు పిటిషనర్ పై నమోదైన కేసు స్వల్పమైనదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. క్రిమినల్ కేసుల్లో పాత్ర ఉన్న విషయాన్ని గోప్యంగా ఉంచడం నిబంధనలకు విరుద్ధం అన్నారు.
ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం విజయ భాస్కర్ పై 2004లో నమోదైన కేసు తేలికైందని... సాక్ష్యాధారాలు లేవనే కారణంతో 2006లో దిగువ కోర్టుఆ కేసును కట్టివేసిందని తెలిపింది. ఎస్సై నియామకాన్ని రద్దు చేయడం అన్యాయం అని పేర్కొంది. ఆయనపై నమోదైన కేసు క్రూరమైంది కాదని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే విజయ భాస్కర్ ను విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
24 ఏళ్ల తరువాత టీచర్ జాబ్..
డీఎస్సీలో క్వాలిఫై అయినా కోర్టు వివాదాలతో ఫలితాల ప్రకటన వాయిదా పడటంతో ఆశలు వదులుకున్నారు అల్లక కేదారేశ్వరరావు. కుటుంబాన్ని పోషించేందుకు దుస్తులు విక్రయించారు. ఆపై ఆటో నడుపుతూ జీవనం సాగించారు కేదారేశ్వరరావు. ఇవేమీ కలిసిరాకపోవడంతో ఉపాధి నిమిత్తం పదేళ్ల కిందట తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. కొద్ది రోజులకు కన్నతల్లీ అదృశ్యమైంది. దీంతో ఒంటరిగా తిరిగి గ్రామానికి చేరుకుని ధీనస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని గ్రామస్తులు తెలపడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. బిక్షాటన చేస్తూ జీవితంపై తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో ఉద్యోగాలపై సీఎం ప్రకటన రావడంతో ఎలా స్పందించాలో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mekapati challenge : దమ్ముంటే రండి, నన్ను తరిమేయండి- నడిరోడ్డుపై కూర్చీ వేసుకుని కూర్చొన్న ఎమ్మెల్యే మేకపాటి
Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు
Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు