YSRCP MLA: మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేయాలి... ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాస్తానన్నారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాలన్నారు. ఇలాంటి చట్టాలు తెస్తేనే మృగాళ్లలో భయం ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలంలో ఆసరా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు రోడ్లపై తిరగాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలపై మానవమృగాల దౌర్జన్యం చేస్తే పక్క దేశాల్లో నడిరోడ్డపై ఉరితీస్తారన్నారు. ఇలాంటి కఠిన చట్టాలు భారత్‌లో ఎందుకు తీసుకురారని ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read: CM Jagan: విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్...
దిశ చట్టంతో న్యాయం
మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రసన్న కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చట్టాలలో మార్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను స్వయంగా లేఖ రాస్తానన్నారు. మహిళపై దారుణాలకు పాల్పడిన వారిని పట్టుకుని శిక్షిస్తే సరిపోదన్నారు. నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే వారిలో భయం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకొచ్చిన దిశ చట్టం ద్వారా కొంత వరకు మహిళలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
Also Read: తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?
గతంలోనూ
నెల్లూరు జిల్లాలోని జగనన్న ఇళ్లపై గతంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇంటి బెడ్ రూము కొత్త జంటలకు కూడా పనికిరావని నల్లపురెడ్డి ఆరోపించారు. నెల్లూరులో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పథకంలో నిర్మించిన పడక గదిలో కనీసం ఇద్దరు పడుకోవడం కూడా అసాధ్యమని పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి వైఎస్సార్ జగనన్న గృహ నిర్మాణాలపై నల్లపురెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

