By: ABP Desam | Updated at : 26 Jun 2022 05:17 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం జగన్(ఫైల్ ఫొటో)
CM Jagan : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ విజయం సాధించడంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, మాజీ మంత్రి గౌతమ్ రెడ్డికి నివాళిగా ప్రజలు 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం జగన్ అన్నారు. విక్రమ్ రెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామ రక్ష అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా... ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి... ప్రతి అవ్వకు, ప్రతి తాతకు... పేరుపేరునా ధన్యవాదాలు! (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2022
మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 82,888 ఓట్ల ఆధిక్యంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచారు. పోస్టల్ బ్యాలెట్ సహా 20 రౌండ్లు పూర్తయ్యేసరికి 82,888 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగారు. ప్రధాన ప్రతిపక్షం ఏదీ బరిలో లేకపోవడంతో ఆయన గెలుపు సునాయసం అయింది. ప్రతి రౌండ్ కి మేకపాటి భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. పోటీలో నిలిచిన మరే ఇతర పార్టీ అభ్యర్థి కూడా విక్రమ్ రెడ్డికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. పోస్టల్ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్ సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్ సీపీ భారీ ఆధిక్యం కనబర్చింది.
గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడంతో ఆత్మకూరుకు ఉపఎన్నికలు వచ్చాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు అయిన మేకపాటి విక్రమ్ రెడ్డినే నిలబెట్టారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి వ్యక్తిని నిలబెడితే తాము పోటీ నుంచి దూరంగా ఉంటామనే సెంటిమెంట్‌తో టీడీపీ దూరంగా ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంది. దీంతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గెలుపు అనేది చాలా సులభం అయింది. విజయం పూర్తిగా ఏకపక్షం అయిపోయింది. ఇక బీజేపీ నుంచి భరత్ కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు.
Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా
Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా
Kuppam Gold Mines : కుప్పంలో బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్, రూ.450 కోట్లకు ఎన్ఎండీసీ టెండర్లు!
Nellore Fish Curry Recipe : నెల్లూరు చేపల పులుసు, ఎందుకంత ఫేమస్?
Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల