అన్వేషించండి

Tdp On Minister Roja : తిరుమలలో రాజకీయాలేంటి రోజక్కా, ఆనం వెంకట రమణా రెడ్డి సెటైర్లు

Tdp On Minister Roja : తిరుమలలో దైవ దర్శనానికి వచ్చిన రాజకీయాలు మాట్లాడడం సరికాదని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. మంత్రి రోజా వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

Tdp On Minister Roja : తిరుమలలో దైవ దర్శనానికి వచ్చిన రోజా రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి. బీఏ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన రోజా నారా లోకేశ్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారాయన. లోకేశ్ ఏం చదువుకున్నారు విదేశాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేశారో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మీ నాయకుడు జగన్  ఏం చదివాడో సర్టిఫికెట్ ఉంటే చూపించండి అని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయి రెడ్డి  వయసుకు తగ్గట్టు మాట్లాడాలని హితవుపలికారు.  విజయసాయి రెడ్డి సర్వేపల్లిలోని తన సొంత ఊరును ఇప్పటి వరకు అభివృద్ధి చెయ్యలేకపోయారని విమర్శించారు.

తిరుమలలో రాజకీయాలా?  

" శనివారం, ఆదివారం ప్రొటోకాల్ దర్శనాలు లేవని టీటీడీ చెప్పింది. భక్తులు పెద్ద సంఖ్యలు వస్తారు ఈ రోజుల్లో. కానీ వారానికి మూడు రోజులు మంత్రి రోజా తిరుపతికి వెళ్తుంది. టీటీడీ ప్రొటోకాల్ దర్శనాలు లేవని చెప్పి మంత్రి రోజాకు ఎలా దర్శనానికి అనుమతించారు. పోనీ దర్శనం చేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడతారు. దేవుని దర్శనానికి వెళ్లి ఏంటమ్మ రాజకీయాలు. తిరుమలలో ఏ పార్టీ వాళ్లు రాజకీయాలు మాట్లాడిన అది తప్పు. రోజక్క ఒకటి మాత్రం నిజం చెప్పింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి స్పందన సూపర్ అన్నారు. నిజమే ప్రజలు తమిరి కొడుతున్నారు ఆ స్పందన మామూలుగా లేదు. విజయసాయి రెడ్డి నువ్వు పుట్టిన ఊరుకి వెళితే అక్కడి ప్రజలు నిన్ను తరిమి కొడతారు. "
--ఆనం వెంకట రమణా రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి 

మంత్రి రోజా కామెంట్స్ 

తిరుమల శ్రీవారిని శనివారం మంత్రి రోజా దర్శించుకున్నారు. తిరుమల ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీని మూసేయాలనే ఆలోచలనలో అచ్చెన్నాయుడు ఉన్నట్లు రోజా విమర్శించారు. తెలంగాణలోలాగా ఏపీలోనూ టీడీపీ మూతపడుతోందన్నారు. వైసీపీలో కష్టపడిన వారంతా ప్రజా ప్రతినిధులు అయ్యారన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తుంటే హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలకు కోత పెట్టకుండా ప్రజలకు ఫలాలు అందిస్తున్నా్రన్నారు. అర్హత ఉన్నవారికి కచ్చితంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి రోజా తెలిపారు. సీఎం జగన్ పాలనకు వస్తున్న ప్రజాధారణ చూసి చంద్రబాబు, లోకేశ్ కోడి గుడ్డుపై ఈకలు పీకినట్లు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget