అన్వేషించండి

CM Jagan : రాజకీయాలంటే డైలాగులు, డ్రోన్‌ షాట్‌లు, డ్రామాలు కాదు - సీఎం జగన్

CM Jagan : రాజకీయం అంటే డైలాగులు, డ్రోన్‌ షాట్‌లు, డ్రామాలు కాదని, ప్రజలకు మంచి చేయడమని సీఎం జగన్ అన్నారు.

CM Jagan : రాజకీయాలంటే షూటింగ్ లు కాదని సీఎం జగన్ అన్నారు. కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నర్సీపట్నంలో పర్యటించిన సీఎం జగన్.. బహిరంగ సభలో మాట్లాడారు. నర్సీపట్నాన్ని గత పాలకులు పట్టించుకోలేదన్నారు. నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని చెప్పారు.  చేసేదే చెబుతామని, చెప్పిందే చేస్తామని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబుపై సీఎం జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు. కొందరు నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వచ్చే నెల నుంచి పెంచిన పింఛన్లు రూ.2750 అందిస్తున్నామన్నారు. పింఛన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ప్రతీ ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ పై వెరిఫికేషన్‌ చేయాలన్నారు. పెన్షన్‌ వెరిఫికేషన్‌పై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.  

రాజకీయాలంటే షూటింగ్ కాదు 

 కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటో షూట్‌, డ్రోన్‌ షాట్స్‌ కోసం జనం లేకపోయినా బాగా వచ్చారని చూపించేందుకు ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టి 8 మందిని చంపేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల టైంలో కూడా చంద్రబాబు తన షూటింగ్‌ కోసం 29 మందిని బలితీసుకున్నారని విమర్శించారు. రాజకీయాలు అంటే షూటింగ్‌లు కాదన్నారు. రాజకీయం అంటే డైలాగులు, డ్రోన్‌ షాట్‌లు, డ్రామాలు కాదని, ప్రజలకు మంచి చేయడమని సీఎం జగన్ అన్నారు. రాజకీయం అంటే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఒక్క  మంచి పనికూడా జరగలేదని విమర్శించారు. దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని పవన్ కు చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ కు ఈ రాష్ట్రం కాకుంటే మరో రాష్ట్రం, ఈ భార్య కాకుంటే మరో భార్య అనే తీరులో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసాలు గుర్తొస్తాయన్నారు.  

చంద్రబాబు, పవన్ కు థ్యాంక్యూ 

నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. తాండవ-ఏలేరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు సీఎం జగన్. నర్సీపట్నాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలన్నారు.  మూడున్నరేళ్లలోనే ఉత్తరాంధ్రకు మెడికల్‌ కాలేజీలు తెచ్చామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. జనవరి 1 నుంచి రూ.2750 పెన్షన్‌ అమలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. పేదలకు పెన్షన్లు పెంచుతుంటే కొందరు ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సభకు జనం ఎందుకొస్తారని ప్రశ్నించారు. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేసినందుకు జనం వస్తారా అని ప్రశ్నిచారు. రుణాలు పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టుపెట్టారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు పాపంలో దత్తపుత్రుడు పవన్‌కు కూడా వాటా ఉందని సీఎం జగన్ ఆరోపించారు. అందుకే చంద్రబాబు, పవన్ కు థ్యాంక్యూ చెప్పాలన్నారు. 

చంద్రబాబు అంటే గుర్తొచ్చేది రెండే 

"రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తానే చేశానని చంద్రబాబు చెప్పుకుంటాడు. సింధు బ్యాడ్మింటన్ గెలిస్తే ఆమెకు తానే బ్యాడ్మింటన్ నేర్చించానని చెప్పుకుంటారు. ఈ పెద్ద మనిషి సొంత నియోజకవర్గంలో నీళ్లు ఉండవు, వైసీపీ ప్రభుత్వం ఇస్తేనే కుప్పంలో రెవెన్యూ డివిజన్ ఇచ్చాం. ఈయన పేరు చెబితో ఒక్క సంక్షేమ పథకం కూడా గుర్తుకురాదు. చంద్రబాబును చూస్తే గుర్తొచ్చేది రెండు వెన్నుపోటు, మోసాలు. చంద్రబాబు సభకు ఎక్కువ జనం వచ్చారని చూపేందుకు ఇరుకు సందులో సభలు పెట్టి 8 మందిని చంపేశారు. "- సీఎం జగన్ 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Leaders Meeting Chandrababu Naidu: ఎన్డీయే రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - ఏపీలో 3 భారీ బహిరంగ సభలకు షెడ్యూల్ ఖరారు!
ఎన్డీయే రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - ఏపీలో 3 భారీ బహిరంగ సభలకు షెడ్యూల్ ఖరారు!
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
AP Cabinet Meeting Decisions June 2026: అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు
అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు - ఏపీ కేబినెట్‌లో సంచలన నిర్ణయాలు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget