News
News
వీడియోలు ఆటలు
X

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

అవసరం అయినప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ ప్రకటించారు. యువగళం పాదయాత్రలో లోకేష్‌తో పాటు పాల్గొన్నారు.

FOLLOW US: 
Share:

Nara Rohit :     యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ...  అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని చంద్రబాబునాయుడు సోదరుడి కుమారుడు, సినీ హీరో  నారా రోహిత్  చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రలో నారా రోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ డెఫన్స్‌లో పడిందని.. అందుకే తెలుగుదేశం పార్టీపై బురదజల్లుతున్నారని విమర్శించారు. యువగళం పాదయాత్ర మున్ముందు ప్రభంజనం రేపుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని   పేర్కొన్నారు.                   
 
నారా రోహిత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో లేరని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో టీడీపీ తరుపున ప్రచారం చేసిన ఎన్టీఆర్..ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన పేరు మాత్రం తరచూ చర్చల్లోకి వస్తోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఈ అంశం మరింత హైలెట్ అయింది. దీనిపై అటు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందన్న విషయాన్ని ఎక్కడా ప్రకటించలేదు.                       

రాజకీయాలకు సంబంధించి ఏదైనా స్పందించాల్సి వచ్చినప్పుడు వీలైనంత వివాదాలు లేకుండా స్పందిస్తున్నారు. ఈ విషయంలో  టీడీపీ అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ ఆయన మత్రం రాజకీయ వివాదాలకు అవకాశం ఇచ్చే ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. అయితే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేురతో కొంత మందిహడావుడి చేస్తూనే ఉన్నారు. ఫ్యాన్ వార్స్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పేరు తరచూ చర్చల్లోకి వస్తోంది. ఇటీవల తిరుపతిలో నారా లోకేష్ కూడా..  జూ.ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని ప్రకటించారు.                      

ఈ ప్రకటనను కూడా కొంత మంది తప్పు పట్టారు. ఆయనను ఆహ్వానించడమేమిటని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మిత్రులుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. వారు తరచుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని చెబుతూ ఉంటారు. ఇప్పుడు నారా రోహిత్ కూడా అవసరం ఉన్నప్పుడు వస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆయన సినీరంగంలో మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెట్టరని భావిస్తున్నారు.                       

Published at : 25 Mar 2023 03:07 PM (IST) Tags: Nara Lokesh Nara Rohit Yuvagalam Padayatra Jr NTR's Politics

సంబంధిత కథనాలు

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Amit Shah Vizag Tour: నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

Amit Shah Vizag Tour: నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

Police Section 30 Act: పవన్ వారాహి యాత్రకు వైసీపీ సర్కార్ బ్రేకులు! 20 రోజుల పాటు అక్కడ సెక్షన్‌ 30 అమలు

Police Section 30 Act: పవన్ వారాహి యాత్రకు వైసీపీ సర్కార్ బ్రేకులు! 20 రోజుల పాటు అక్కడ సెక్షన్‌ 30 అమలు

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !