అన్వేషించండి

Nara Lokesh In London: 15నెలల్లో 10లక్షల కోట్ల పెట్టుబడులు- క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో మారనున్న ఏపీ రూపురేఖలు: నారా లోకేష్

Andhra Pradesh UK Business Forum Roadshow In London | కూటమి పాలనలో 15 నెలల్లోనే ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, చంద్రబాబు నాయకత్వం వల్లే అది సాధ్యమైందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.

లండన్: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం, గత 15నెలల్లో ఏపీకి 10లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అది విజనరీ లీడర్ చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు లండన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా ఏపీ ప్రభుత్వం - యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో నారా లోకేష్ పాల్గొన్నారు.

ఏపీకి సుస్థిరమైన నాయకత్వం

ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్ర యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి సాధించడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది లీడర్ షిప్ ట్రాక్ రికార్డ్. మాకు సుస్థిరమైన నాయకత్వం ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆయన అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు. 

2వది స్పీడ్ ఆఫ్ డూయింగ్ కు మేం ప్రాధాన్యత నిస్తున్నాం. ప్రాజెక్టు ఆరునెలలు ఆలస్యమైతే మొత్తం బిజినెస్ ప్లాన్ దెబ్బతింటుంది. భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను ఆర్సెలర్ మిట్టల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయబోతోంది. గత ఏడాది జూన్ లో వారితో చర్చలు జరిపినపుడు, వారు మూడు ప్రత్యేక అభ్యర్థనలు చేయగా, కేవలం 12గంటల్లోనే పరిష్కరించాం. నవంబర్ లో ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. దేశంలో అతిపెద్ద డాటా సెంటర్ త్వరలో విశాఖపట్నానికి రాబోతోంది. టిసిఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకే మేం ఎకరా 99 పైసలకే భూములు ఇచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాం.


Nara Lokesh In London: 15నెలల్లో 10లక్షల కోట్ల పెట్టుబడులు- క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో మారనున్న ఏపీ రూపురేఖలు: నారా లోకేష్

మంత్రివర్గంలో, ఎమ్మెల్యేల్లో కొత్తవారికి స్టార్టప్ మైండ్ సెట్

మూడవది మావద్ద ఉత్సాహవంతంగా పనిచేసే కొత్తతరం యువనాయకత్వం... మొత్తం శాసనసభలో 50శాతం తొలిసారి గెలిచినవారు. మంత్రివర్గంలోని 25మందిలో 17మంది కొత్తవారే. వారందరికీ స్టార్టప్ మైండ్ సెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ స్టేట్. మేమంతా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయలన్న తపన, పట్టుదలతో పనిచేస్తున్నాం. విజనరీ లీడర్ చంద్రబాబు గారి నాయకత్వాన గత 15నెలల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగాం. ఎంఓయులతో సరిపెట్టకుండా ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యం. ఇటువంటి సాహసోపేతమైన హామీని దేశంలో మేం మాత్రమే ఇచ్చాం. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను తెచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా ప్రధాన ధ్యేయం.

అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్

దక్షిణ ఆసియాలో తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతికి రాబోతోంది. భారత ప్రధాని మోదీ క్వాంటమ్ మిషన్ ను ముందుండి నడిపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దీనిద్వారా అమరావతిలో అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు కాబోతోంది. విశాఖలో డాటా సిటీ నిర్మాణం వల్ల అక్కడ కేబుల్స్ ల్యాండ్ అవుతాయి. ముంబాయి కన్నా రెట్టింపు సామర్థ్యంతో 1.5 గిగావాట్ల డేటా సెంటర్స్ విశాఖకు రాబోతున్నాయి. రాబోయే మూడేళ్లలో అవి పూర్తవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో ఎపి దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సాధించబోతోంది. క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి.


Nara Lokesh In London: 15నెలల్లో 10లక్షల కోట్ల పెట్టుబడులు- క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో మారనున్న ఏపీ రూపురేఖలు: నారా లోకేష్

ఐటి విప్లవం వల్ల భారతదేశం లబ్ధి పొందింది. ఇప్పుడు ఎఐ సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎఐ ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మేం స్కిల్ అప్ గ్రేడేషన్ కు ప్రాధాన్యత నిస్తున్నాం. కళాశాలలు, యూనివర్సిటీల్లో ఎఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఎఐ గేమ్ చేంజర్ కాబోతోంది. వివిధ పరిశ్రమలకు అవసరమైన వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం తరపున స్కిల్ ఇంటర్వెన్షన్ ను అమలు చేస్తున్నాం. యువతలో నైపుణ్యాలను పెంపొందించి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అక్టోబర్ లో నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభించబోతున్నాం. 

విజన్ – 2047 లక్ష్యంలో ప్రధానమైన $ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవడానికి ప్రతిఏటా సగటున 15శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా మేం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 5వేల ఎకరాల్లో మేం స్పేస్ సిటీని నిర్మించబోతున్నాం. భారత్ లో స్పేస్ ఎక్స్ కు సమానమైన స్కైరూట్ అనే సంస్థకు 300 ఎకరాలు కేటాయించాం. భూమి ధరకు సంబంధించి ఆ సంస్థ విజ్ఞాపనను పరిశీలించి, కేబినెట్ లో చర్చించి కేవలం వారంరోజుల్లో ఆ సంస్థకు భూకేటాయింపులు పూర్తిచేశాం. యుఎస్ అదనపు సుంకాల  నేపథ్యంలో సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగుతాం. యుకె, రష్యా, యూరప్ లలో కొత్త మార్కెట్లను వెతుక్కుంటాం.

పరిశ్రమల స్థాపనకు వంద రోజుల ప్రణాళిక

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పెట్టుబడి దారులకు సహకరించేందుకు మేం వందరోజుల ప్రణాళికను అమలు చేస్తున్నాం. అయిదుగురు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సలహామండలిని ఏర్పాటుచేశాం. పరిశ్రమలస్థాపనలో ప్రతిబంధకంగా ఉన్న కొన్ని నిబంధనలను సవరిస్తున్నాం. ఎపిలో కార్మిక సంస్కరణలు, ల్యాండ్ కన్వర్షన్, నాలా టాక్స్ వంటివి సవరించాలని కేంద్రమంత్రి అశ్వనీ వైష్టవ్ సూచించగా, కేవలం 45రోజుల్లో ఆ సవరణలు పూర్తిచేశామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ రోడ్ షోలో యుకె డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ హర్షూల్ అస్నానీ, ఐసిఐసిఐ బ్యాంకు యుకె విభాగం సిఇఓ రాఘవ్ సింఘాల్, ఎపిఐఐసి వైస్ చైర్మన్ & ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150మంది సిఇఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
Advertisement

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget