News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Lokesh : నిరసనలు చేస్తే హత్యాయత్నం కేసులా ? - జగన్ సర్కార్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు !

శాంతియుత నిరసనలు చేస్తే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏమిటని ఏపీ సర్కార్‌ను లోకేష్ ప్రశ్నించారు. సముద్ర గర్భంలో, అంతరిక్షంలో, భూగర్భంలో కూడా 144 సెక్షన్ .. 30 పోలీస్ యాక్ట్ పెట్టేలా ఉన్నారన్నారు.

FOLLOW US: 
Share:

Lokesh :   బ్రిటీష్ పాలనను మించిన స్థాయిలో రాష్ట్రంలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై ప్రభుత్వ అక్రమ కేసులు, నిర్భంధాలు ఉన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.  చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా చేస్తున్న నిరాహారదీక్ష లు, కొవ్వొత్తుల ర్యాలీలపైనా హత్యాయత్నం కేసులు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు. ల  టీడీపీ అధినేతకు సంఘీభావంగా సముద్ర తీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసిన వారిపైనా కేసు పెట్టడం లాంటి చర్య దేశంలో మరెక్కడా జరిగి ఉండదన్నారు.  ఈ దిక్కుమాలిన ప్రభుత్వం తీరు చూస్తుంటే సముద్ర గర్భంలో, అంతరిక్షంలో, భూగర్భంలో కూడా 144 సెక్షన్ ఉంది, 30 పోలీస్ యాక్ట్ ఉంది అనేలా ఉన్నారన్నారు.                           
 
శాంతియుత నిరసనలూ జరగడానికి వీల్లేదని సీఎం రివ్యూ చేసి మరీ డీజీపీకి అదేశాలు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు.  ప్రజా స్వామ్యంలో ప్రజలు తమ నిరసనలు తెలిపే హక్కును కాదని చెప్పే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు.   పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలపై లేని నిషేధం ఎపిలోనే ఎందుకు? పక్కన ఉన్న తెలంగాణ లో లేని నిర్బంధాలు మన రాష్ట్రంలో ఎందుకో సైకో సర్కార్ సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు. ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాన్ని....ఈ ప్రభుత్వం తుప్పు పట్టిన అక్రమ కేసుల విధానంతో ఇక అడ్డుకోలేదని హెచ్చరించారు.                                      

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. బాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలు చేపడుతూ నిరసన తెలియచేస్తున్నారు. ఐ యామ్ విత్ బాబు పేరుతో  ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాలు చేపడుతున్నారు. పలుచోట్ల తెలుగు తమ్ముళ్ల ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. దీంతో పోలీసులు ఆందోళనలను అడ్డుకుంటున్నారు.         

టీడీపీ శ్రేణుల నిరసనలకు సంబంధించి తాజాగా ఏపీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ముందుగా అనుమతి తీసుకుని, ఆ తర్వాతే నిరసనలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే వారికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పర్మిషన్ లేకుండా నిరసన కార్యక్రమాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు అనుమతి లేని నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనుమతి లేని ఆందోళన కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని సూచిస్తున్నామన్నారు. క్రిమినల్ కేసులు నమోదైతే యువతకు ఇబ్బందులు ఉంటాయని, భవిష్యత్తులో ఉద్యోగాలు రావని హెచ్చరించారు.

శాంతియుత నిరసనలపైనా ఉక్కుపాదం మోపుతూండటంపై టీడీపీ మండిపడుతోంది.             

Published at : 23 Sep 2023 03:32 PM (IST) Tags: Nara Lokesh AP Politics CM Jagan AP law and order

ఇవి కూడా చూడండి

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ - ఎందుకంటే ?

CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ -  ఎందుకంటే ?

Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే