అన్వేషించండి

Nara Brahmani: కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్! - నారా బ్రాహ్మిణిని కలిసిన జీవీ శ్రీరాజ్

Nara Brahmani: మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు జీవీ శ్రీరాజ్.. నారా బ్రాహ్మిణిని మర్యాద పూర్వకంగా కలిశారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని శ్రీరాజ్ వెల్లడించారు.  

Nara Brahmani: మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు జీవీ శ్రీ రాజ్, కోడళ్లు అన్విత, అంకితలు నారా బ్రాహ్మిణిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమండ్రిలో క్యాంప్ ఆఫీసులో ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు కోడలు నందమూరి నారా బ్రాహ్మణి బాధను పంచుకోవడానికి వెళ్లినట్లు తెలిపారు. మద్దతు ఇచ్చి ఓదార్చే ప్రయత్నం చేసినట్లు వెల్లడిచారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అరెస్టు చేసి 80 రోజులు సెంట్రల్ జైల్లో ఉంచారని.. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబును కావాలని జైల్లో పెట్టించారని చెప్పుకొచ్చారు. 

ఒక కేసులో అరెస్టు చేసి, వివిధ కేసుల్లో పీటీ వారెంట్లు జారీ చేసి జైలు పదవీ కాలాన్ని పొడగించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతగానో ప్రయత్నిస్తున్నారని జీవీ శ్రీరాజ్ వెల్లడించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో సీఎం జగన్ అనుకున్న రీతిలో పాలించలేకపోతున్నారని, పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయలేకపోతున్నారని ప్రజలు చర్చించుకంటున్నట్లు పేర్కొన్నారు. పేదవాడు తాగే చీప్ లిక్కర్ కి విదేశీ మద్యం రేట్లు వేయడం దారుణం అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టు డైవర్ట్ అయ్యేలా.. మైండ్ గేమ్ లో భాగంగా జరుగుతున్న విషయమేనని చెప్పుకొచ్చారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. 

మరోవైపు అక్టోబర్ రెండు నుంచి నారా భువనేశ్వరి నిరాహార దీక్ష

టీడీపీ అధినేత  చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్‌ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు.  నంద్యాలలో  చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్న ప్రకటించారు. ఆ రోజు నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్‌ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ప్రజలు నిరసన తెలపాలని కోరారు. లైట్లు ఆపి వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలన్నారు.ఈ సమావేశంలో ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌ రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని నేటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ జేఏసీ రాష్ట్రస్థాయిలో ఉంటుందని, ఇకపై ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో జనసేనతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ కార్యకలాపాలు ఉంటాయని వివరించారు.  లోకేశ్ పై సంబధం లేని ఆరోపణలు చేస్తున్నారని, అసలక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు కేసు ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పైగా, భూసేకరణ కూడా జరగలేదని వెల్లడించారు. ఏమీ జరగని చోట ఏదో జరిగిందనే భ్రాంతికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ  పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశానికి  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  ఢిల్లీ నుంచి జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. పలు కీలక సూచనలు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget