News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Nara Bhuvaneswari: ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబు సింహంలా బయటకు వస్తారు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం వెళ్లారు. అంతా కలిసి సత్యదేవుడిని దర్శించుకున్నారు. అనంతరం జగ్గంపేటలో నిర్వహించిన దీక్షల్లో పాల్గొన్నారు

FOLLOW US: 
Share:

Nara Bhuvaneswari: కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరం దేవస్థానానికి నారా భువనేశ్వరి తన కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. అంతా కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తన భర్త అయిన చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల అవ్వాలని నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. అయితే దేవస్థాన సిబ్బంది.. మర్యాదపూర్వకంగా ఆమెకు ఘన స్వాగతం పలికారు. వారి వెంటే ఉండి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు  ఆశీర్వచనం అందజేశారు. ఈ తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ అన్నవరం దేవస్థానానికి చేరుకుని భువనేశ్వరి గారికి తమ సంఘీభావం తెలిపారు.

ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు నారా భువనేశ్వరి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసత దీక్షలో సొమవారం భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన అనంతరం ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భువనేశ్వరి... చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని అన్నారు.  ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారని అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం దారుణం అన్నారు.  తాను స్వయంగా ఓ సంస్థను నడుపుతున్నానని పేర్కొన్నారు. ఆ సంస్థలో రెండు శాతం వాటా అమ్ముకున్నా 400 కోట్లు వస్తాయని తెలిపారు. 

చంద్రబాబు సింహంలా బయటకు వచ్చి మీ కోసం మళ్లీ పని చేస్తారు. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉంది. ప్రజల్ని ముందుకు నడిపించడమే చంద్రబాబు లక్ష్యం అన్నారు భువనేశ్వరి. అవినీతి మరక అంటించి 17 రోజులుగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనేం తప్పు చేశాడని జైల్లో నిర్బంధించారు అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం కంటే ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటుందన్నారు. ప్రజల కోసం మేము వస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 2 వేల మంది అనాథ పిల్లలను ఉచితంగా చదివిస్తున్నాం..అలాంటి సేవే మాకు ఎన్టీఆర్ చూపించిన మార్గమని చెప్పారు. 

ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడే వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు భవనేశ్వరి. అలాంటి వ్యక్తి తప్పులెందుకు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం కష్టపడటమే ఆయన చేసిన తప్పా అని నిలదీశారు. హైదరాబాద్ లో రాళ్లు, రప్పలున్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మించారు. కనీసం సదుపాయాలు లేని ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటని ఆనాడు అందరూ నవ్వారు.. కానీ ఇప్పుడు అక్కడ వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. చంద్రబాబు సంపద సృష్టించే నాయకుడు అన్నారు.

బ్రిటిష్ పాలకుల కాలంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తులు జైలుకు వెళ్లారు.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజల కోసం జైలుకు వెళ్లారని వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలెప్మెంట్ ద్వారా లబ్ది పొందిన వారు ఉన్నత స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు..యువత జీవితాలు మార్చడం తప్పా అని ప్రశ్నించారు.  

చంద్రబాబుపై అభిమానంతో ఆంధ్రప్రదేశ్ వస్తున్న వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు భువనేశ్వరి. తెలంగాణ నుంచి వస్తున్న కార్ల ర్యాలీని అడ్డుకోవడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రావాలంటే వీసాలు, పాస్‌పోర్టు తీసుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషేనని... ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని అన్నారు. 

Read Also: Chandrababu Custody Extends: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు

Published at : 25 Sep 2023 01:39 PM (IST) Tags: AP News Annavaram Nara Bhuvaneshwari CBN Arrest Nara Bhuvaneshwari Special Puja

ఇవి కూడా చూడండి

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం

Gold-Silver Prices Today 05 December 2023: కనుచూపు మేరలో కనిపించని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 05 December 2023: కనుచూపు మేరలో కనిపించని పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Michaung cyclone Effect: కోనసీమకు పొంచి ఉన్న మిచాంగ్‌ తుపాను ముప్పు, రెడ్‌ అలెర్ట్‌ జారీ

Michaung cyclone Effect: కోనసీమకు పొంచి ఉన్న మిచాంగ్‌ తుపాను ముప్పు, రెడ్‌ అలెర్ట్‌ జారీ

టాప్ స్టోరీస్

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Sleeping on Floor Benefits : అసలు నేలమీద పడుకుంటే ఎంత మంచిదో తెలుసా?

Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం

Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
×