అన్వేషించండి

Nara bhuvaneswari : నిజం గెలవాలంటే చేయి చేయి కలిపి పోరాడదాం - ప్రజలకు నారా భువనేశ్వరి పిలుపు!

నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి యాత్రలో భాగంగా అగరాల గ్రామంలో ప్రసంగించారు. నిజం గెలిచేందుకు చేయి చేయి కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు.

Nara bhuvaneswari :  చంద్రబాబుపై ఏ కేసులోనూ ఆధారాలు లేవని.. కేవలం ఆయనను కట్టడి చేయడానికే జైలులో పెట్టారని నారా భువనేశ్వరి అననారు. నిజం గెలవాలి పేరుతో  నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా అగరాలలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని భువనేశ్వరి ప్రస్తావించారు. రాజకీయాలు మాట్లాడటానికి తాను రాలేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. రాష్ట్రాన్ని ఓ స్థాయికి తీసుకు రావడానికి, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, పరిశ్రమల్ని తీసుకు రావడానికి ఎంత కష్టపడ్డారో తాను కళ్లారా చూశానన్నారు. ప్రజల కోసమే ఆయన నిరంతరం ఆలోచిస్తారని స్పష్టం చేశారు. నిజం నలకడగా అయినా గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. లోకేష్  పాదయాత్రలో మైక్, స్టూల్, వ్యాన్ కూడా తీసుకున్నారన్నారు. మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దమని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

టీడీపీ వాళ్లు కనిపిస్తే కేసులు పెడుతున్నారని.. ప్రతి ఒక్కరిపై మఫ్పైకి పైగా కేసులు పెట్టారని మండిపడ్డారు. అందర్నీ తీసుకెళ్లి జైలులో పెట్టారన్నారు. పరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించుకోవాలన్నారు.  ప్రజల జీవితాల్లో ఆశ, జ్యోతి నింపిన నేత చంద్రబాబునాయుడు అన్నారు. తాను ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో ఉన్నానని.. మూడు వేల మంది  పేదలకు చదువులు చెప్పిస్తున్నారని అన్నారు. తన  బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని గద్గద స్వరంతో  ప్రసంగించారు.   
 
రెండు రోజులుగా నారావారిపల్లెలో ఉన్నా.. ఎప్పుడూ కుటుంబంతో వెళ్ళే దాన్ని కానీ ఈ సారి నేను ఒక్క దానినే వేళ్ళితే గుండెలు పిండేసిందన్నారు.  మొదటి సారి రాజకీయ సభలను నేను వస్తున్నా.. నిజం గెలవాలని నేను మీకు చెప్పేందుకు నేను మీ ముందుకు వచ్చానన్నారు.  నిజం గెలవాలనే పోరాటం నా ఒక్కదానిదే కాదు..మీ‌ అందరిది ఈ పోరాటమని..  మీ భావితరాల కోసం, చంద్రబాబు బయటకు తీసుకుని రావడం కోసం మనం పోరాటం చేయాలన్నారు.  ఎన్టీఆర్ కుమార్తేగా పుట్టడం తన అదృష్టమని..  ఎన్టీఆర్ స్పూర్తితో నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారనిగుర్తు చేసుకున్నారు.  ఎన్టీఆర్ పై స్పూర్తితోనే ఎన్టీఆర్ ట్రస్టు చంద్రబాబు నెలకొల్పారు.. మూడు వేల మందికి పైగా పేద విద్యార్ధులను నేను చదివిస్తున్నానన్నారు.  చంద్రబాబు గురించి నా కంటే మీకే బాగా తెలుసు..ఎప్పుడూ ఆయనకు ప్రజలే కుటుంబమన్నాకుయ 

హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే..  హైటెక్ సిటీ కడుతుంటే అందరూ విమర్శించారు..కానీ చంద్రబాబు విజన్ ఏమిటో ప్రజలకు తెలుసన్నారు.  ఐటీ రంగంను తీసుకుని వచ్చి లక్షలాది మంది జీవితాల్లో సంతోషాన్ని నిలిపారు చంద్రబాబు.. రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు ఎలా కష్ట పడ్డారో నేను కళ్ళారా చూసాన్నారు.  45 రోజులుగా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిర్భందించారని ఆవేదన వ్యక్తం చేశారు.  స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటారు,ఫైబర్ గ్రిడ్ అంటారు.. మూడు వేల కోట్లు స్కాం అని చెప్పి 27 కోట్లు అంటు వైసిపి చెప్తుంది.. దేశంలో ఏపిని నెంబర్ వన్ గా ఉంచాలని నిత్యం ఆలోచించేవారు చంద్రబాబు అని గుర్తు చేసుకున్నారు. 

చంద్రబాబును అరెస్టు చేసి జైల్ లో పెట్టడం భాధాకరమని..  చిత్తూరు జిల్లాలో‌ చంద్రబాబుపై   హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు.  శ్రీకాకుళం నుండి పుంగనూరు వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తలను అడ్డుకోవడం దారుణన. టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించడం భాధాకరమన్నారు.  వైసీపి‌ నాయకులు ఎన్ని కష్టాలు పెట్టినా పైకి లేచి మరి టిడిపి కార్యకర్తలు నిలబడుతున్నారన్నారు.  యావత్తు ప్రపంచంలోని ప్రజలంతా చంద్రబాబు కోసం పోరాడుతున్నారు.. మహిళను దారుణంగా హింసించడం వైసీపి పరిపాలనా అని ప్రశ్నించారు.  ఇవాళ కాక పోయినా రేపు నిజం గెలుస్తుంది..  చంద్రబాబును నిర్భందిస్తే, మెటల్ గా డిస్టబ్ అవుతారని వైసిపి భావిస్తోందన్నారు.  చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సన్..మళ్ళీ చంద్రబాబు మీ అందరి ముందు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.  నిజం గెలవాలని మనం అందరం చేయి చేయి కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Embed widget