అన్వేషించండి

MLA Vasantha Krishna Prasad: భారీ వర్షాలు - నడుము లోతు నీటిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన

Andhra News: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నడుము లోతు నీటిలోనే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు.

Mylavaram MLA Vasantha Krishna Prasad Visits NTR District: వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, విశాఖ, అల్లూరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాల నేపథ్యంలో బయటకు రావొద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలోని (Krishna District) వరద ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం (Mylavaram) ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ (Vasantha Venkata Krishnaprasad) నడుము లోతు నీటిలో పర్యటించారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ప్రాంతంలో లోతు నీటిలోనే ఉంటూ వరద బాధితులను పరామర్శించారు. సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమన్వయం చేశారు.

ప్రతి ఇంటికీ ఆహారం, తాగునీరు అందించాలని సూచించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అటు, పెన్షన్లను సైతం వరద నీటిలోనే పంపిణీ చేశారు. పంపిణీకి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అటు, ఎమ్మెల్యే చర్యలపై ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలోనే ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షించడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

ప్రజల తీవ్ర ఇబ్బందులు

భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు నగరాల్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్‌లో రహదారులు జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయవాడ బస్టాండ్ పరిసరాలు నీట మునిగాయి. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరి జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసేశారు. భారీ వర్షాలకు గుంటూరు నగరంలోని గడ్డిపాడు చెరువు పొంగిపొర్లుతోంది. గడిచిన 24 గంటల్లో మచిలీపట్నం 19 సెం.మీ, విజయవాడ 18, గుడివాడ 17, కైకలూరు 15, నర్సాపురం 14, అమరావతి 13, మంగళగిరి 11, నందిగామ, భీమవరం 10, పాలకొల్లు, తెనాలిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

Also Read: Vijayawada Rains: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి, ఒక్కో ఫ్యామిలీకి రూ.5 లక్షల చొప్పున పరిహారం

20 రైళ్లు రద్దు

భారీ వర్షాల క్రమంలో విజయవాడ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రాబోయే 2 రోజుల పాటు దాదాపు 20 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ - తెనాలి, విజయవాడ - గూడూరు, విజయవాడ - కాకినాడ పోర్టు, తెనాలి - రేపల్లె, గుడివాడ - మచిలీపట్నం, భీమవరం - నిడదవోలు, నర్సాపూర్ - గుంటూరు, గుంటూరు - రేపల్లె, గుంటూరు - విజయవాడ, విజయవాడ - నర్సాపూర్, ఒంగోలు - విజయవాడ, విజయవాడ - మచిలీపట్నం, విజయవాడ - ఒంగోలు రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Also Read: Trains Cancelled: వాయుగుండంతో భారీ వర్షాలు - విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు, దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
Yash: 'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
MS Dhoni Animated Discussion: మిస్ట‌ర్ కూల్ కు కోపమొచ్చింది.. అంపైర్ తో సీరియ‌స్ గా చ‌ర్చించిన ధోనీ.. ముంబై చేతిలో ఓట‌మితో నిరాశ‌
మిస్ట‌ర్ కూల్ కు కోపమొచ్చింది.. అంపైర్ తో సీరియ‌స్ గా చ‌ర్చించిన ధోనీ.. ముంబై చేతిలో ఓట‌మితో నిరాశ‌
Embed widget