అన్వేషించండి

Mudragada : ముద్రగడకు క్యాన్సర్ - చికిత్స చేయించకుండా బంధించారు - కుమార్తె క్రాంతి ఆరోపణ

Mudragada daughter : ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు క్యాన్సర్ ఉన్నా చికిత్స చేయించట్లేదని ఆరోపించారు.

Mudragada Padmanabham Cancer:  వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమార్తె ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ముద్రగడ పద్మనాభంకు క్యాన్సర్ ఉందని కానీ చికిత్స చేయించడం లేదని.. ఆయనను ఓ చోట బంధించి ఎవరినీ కలవనివ్వకుండా, సంప్రదించనివ్వకుండా చేస్తున్నారని ముద్రగడ కుమార్తె క్రాంతి ఆరోపించారు. 
 
 తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారని.. తన సోదరుడు గిరి సరైన చికిత్సను చేయించడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు.   ఓ  మాజీ YSRCP ఎమ్మెల్యే తనను తండ్రిని కలవడానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని కానీ తన సోదరుడు   గిరి , అతని మామ అనుమతించలేదన్నారు.  తన తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. తమ దగ్గరి బంధువులకు, ముద్రగడ సన్నిహితులకూ  కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని క్రాంతి చెబుతున్నారు. గిరి, అతని బంధువుల ముద్రగడను బంధించి, ఒంటరిగా ఉంచుతున్నారని తెలిసిందని..  ఎవరూ ముద్రగడను సంప్రదించడానికి, మాట్లాడటానికి అనుమతించడం లేదని ట్వీట్‌లో తెలిపారు.  రాజకీయ కారణాల కోసం ఇలా చేస్తున్నట్లయితే  వదిలిపెట్టననని సోదరుడు గిరికి క్రాంతి హెచ్చరించారు.  

ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన సమయంలో క్రాంతి వెలుగులోకి వచ్చారు. తన తండ్రితో విబేధించారు. జనసేన పార్టీలో చేరారు. అప్పట్లో ముద్రగడ కూడా  పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయినందున ఆమెతో సంబంధం లేదన్నట్లుగా  చేశారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు లేనట్లుగా చెబుతున్నారు. అయితే రాజకీయ సంబంధాలు వేరు.. మానవ సంబంధాలు వేరని.. రాజకీయంగా వేర్వేరు దారుల్లో ఉన్నంత మాత్రాన కుటుంబాన్ని కూడా చీల్చుకోవాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. 

 ఇటీవల వెన్నుపోటు దినంలో చాలా మంది పాల్గొన్నారని అందరికీ ధ్యాంక్స్ చెబుతూ ముద్రగడ పేరుతో లేఖ బయటకు వచ్చింది. అనారోగ్యం వల్ల తాను పాల్గొనలేకపోయానని అందులో ముద్రగడ పేర్కొన్నారు. . ప్రస్తుతం ముద్రగడ వ్యవహారాలన్నీ వైసీపీ నేత ఆయన కుమారుడు గిరి చూసుకుంటున్నారు. ఆయన ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభరెడ్ిగా మార్చుకున్నారు. ఆయనకు క్యాన్సర్ సోకిందని..  సరైన వైద్యం ఇప్పించడం లేదని కుమార్తె ఆరోపించడం సంచలనంగా మారుతోంది.                           

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget