Chevireddy : ఎన్నికల సమయంలో 500 కోట్లు తరలించానని కేసు పెట్టబోతున్నారు - చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
YSRCP: తనపై డబ్బు తరలింపు కేసులు పెట్టబోతున్నారని వైసీపీ నేత చెవిరెడ్డి ఆరోపించారు. తన దగ్గర పని చేసిన వాళ్లని వేధిస్తున్నారని ఆయన అంటున్నారు.

YSRCP leader Chevireddy: వైసీపీ నేత చెవిరెడ్డి తనపై కేసులు పెట్టబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిన చెవిరెడ్డి గతంలో తన వద్ద పని చేసిన వారందర్నీ వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తాను రెండు వందల నుంచి ఐదు వందల కోట్లను తరలించానని కేసులు పెట్టబోతున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటున్నారు.
ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి తరలిస్తున్న 8 కోట్ల రూపాయలు దొరికాయి. ఇప్పుడు దానికి అన్ని ఆధారాలు సమర్పించామని..కానీ డబ్బులు విడుదల చేయలేదని అంటున్నారు. ఆ డబ్బుకు ఆధారాలు అన్ని ఉన్నాయని ఆ విషయం కోర్టులో ఉందని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ విప్ గా ఉన్నప్పుడు గిరి అని నా గన్ మ్యాన్ గా ఉండేవారని ఇప్పుడు గన్ మ్యాన్ గిరి ని బలవంతంగా విచారిస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దొరికిన డబ్బులు తనవేనని సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. 200 నుంచి 500 కోట్లు డబ్బు నేను తరలిస్తున్నారని చెప్పమంటున్నారని..కానిస్టేబుల్ గిరి ని బెదిరించి రాయించుకొని నాపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కానిస్టేబుల్ గిరి ను ఐదు రోజులు టార్చర్ పెట్టారు. మా పీఏ లను, డ్రైవర్లను, గన్ మ్యాన్ లను తీసుకొని వెళ్లి నాపై కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో నన్ను చేర్చాలని చూస్తున్నారని.. మద్యం వల్ల నా ఇంట్లో ఇద్దరు చనిపోయారు, మద్యం కి నేను ఎప్పటికీ దూరమని చెప్పుకొచ్చారు. తనను అరెస్టు చేయడానికి బెటాలియన్లు అవసరం లేదని.. నన్ను అరెస్ట్ చేయడానికి బెటాలియన్లు అవసరం లేదు, రమ్మంటే నేను వస్తానని ప్రకటించారు.





















